• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ అప్డేట్ : ప్రశాంత్...

బిగ్ అప్డేట్ : ప్రశాంత్ నీల్ తో NTR31.. ఊర మాస్ అవతార్ లో తారక్..!

By - Tupaki Desk
Update: 2022-05-20 07:16 GMT
ఇవాళ మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఇది అభిమానులతో పాటుగా తారక్ కు కూడా ప్రత్యేకమైనదిగా చెప్పాలి. ఎందుకంటే RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తర్వాత వచ్చిన బర్త్ డే ఇది. దీన్ని మరింత స్పెషల్ గా మార్చడానికి జూ. ఎన్టీఆర్ తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేశాయి.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న #NTR30 నుంచి వచ్చిన బిగ్ సర్ప్రైజ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తారక్ ఫేస్‪ లుక్ ని రివీల్ చేయనప్పటికీ.. పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో అతని పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ చిన్న వీడియోతో తెలియజెప్పారు.

ఈ క్రమంలో పాన్ ఇండియా టైగర్ ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సాహాన్ని అందించడానికి తాజాగా #NTR31 అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. 'కేజీయఫ్' ప్రాంఛైజీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్నాడని గత ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే ఎన్టీఆర్ - ప్రశాంత్ సైతం తమ కాంబోలో మూవీ రానుందని క్లారిటీ ఇచ్చారు. నేడు అగ్ర హీరో బర్త్ డే స్పెషల్ గా NTR31 ను అధికారికంగా ప్రకటిస్తూ.. తారక్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. ఇందులో యంగ్ టైగర్ గుబురు గడ్డం కోరమీసంతో మోస్ట్ వైలెంట్ గా ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు.

ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ప్రశాంత్ నీల్ ఆయన లుక్ మరియు గెటప్ ని డిజైన్ చేశారని చెప్పాలి. ''రక్తంతో తడిసిన నేల మాత్రమే గుర్తుకు వస్తుంది.. ఆయన నేల.. ఆయన పాలన.. అయితే అది కచ్చితంగా ఆయన రక్తం కాదు'' అని #NTR31 మేకర్స్ పేర్కొన్నారు.  

ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇది పవర్ ఫుల్ స్టోరీతో వచ్చే భారీ చిత్రమని.. KGF తరహాలో ఉంటుందని.. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో తెరకెక్కనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

మాస్ అండ్ యాక్షన్ కు పెట్టింది పేరు ఎన్టీఆర్. హీరోయిజమ్ - ఎలివేషన్స్ చూపించడంలో నీల్ స్పెషలిస్ట్. RRR చిత్రంతో తారక్ 1100 కోట్ల క్లబ్ లో చేరితే.. KGF-2 తో ప్రశాంత్ 1200 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు యాక్టింగ్ పవర్ హౌస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ కలిసి #NTR31 తో బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

2022 అక్టోబర్ లో #NTR31 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అప్పటి వరకు కొరటాల శివ సినిమాతో తారక్.. 'సలార్' మూవీతో ప్రశాంత్ నీల్ బిజీగా ఉండనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Tags:    
  • NTR31 
  • PrashantNeel 
  • NTR 
  • RRR 
  • PanIndia 
  • NTR30 
  • KoratalaSiva 
  • Anirudh 
  • KGF 
  • FirstLook 
  • Salaar 
  • Prabhas 
  • MythriMovies 
  • TupakiNews 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS