మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనున్న భోళా శంకర్..!

Update: 2023-04-30 21:00 GMT
ఆచార్య, గాడ్ ఫాదర్ నిరాశ పరచినా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ తన స్టామినా ఏంటన్నది బాక్సాఫీస్ దగ్గర చూపించారు. బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందించింది. సినిమాతో చిరు మాస్ మేనియా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత మెహెర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. తమిళ హిట్ సినిమా వేదాళం రీమేక్ గా ఈ మూవీ వస్తుందని టాక్.

సినిమాలో తమన్నా చిరుకి జోడీగా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా చేస్తుంది. సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్నా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా ఆగష్టు 11న సినిమా రిలీజ్ లాక్ చేశారు. అయితే ఆ డేట్ కి భోళా శంకర్ రావడం కష్టమని టాక్. ఆగష్టు 11న డీజే టిల్లుతో పాటుగా మరో సినిమా కూడా రిలీజ్ లాక్ చేశారు.

బహుశా చిరు సినిమా రావడం కష్టమని వారికి లీక్ అయినట్టు ఉంది అందుకే ఆగష్టు 11న టిల్లు స్క్వేర్ వస్తున్నాడు. ఇక ఆగష్టు పోతే సెప్టెంబర్ లో రిలీజ్ చూడాలి. లేదంటే దసరా కి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దసరాకి ఆల్రెడీ బాలకృష్ణ 108తో పాటుగా రామ్ సినిమా వస్తుంది. ఈ రెండిటితో పాటుగా మరో క్రేజీ సినిమా కూడా రిలీజ్ అంటున్నారు. భోళా శంకర్ ఆగష్టు మిస్ అయితే దసరాకి మాత్రం వచ్చే ఛాన్స్ లేదు. మెగాస్టార్ సినిమా కాబట్టి ఎప్పుడు రిలీజ్ చేసినా ఫ్యాన్స్ కి పండగే.

కాబట్టి సెప్టెంబర్ లో మంచి రిలీజ్ డేట్ చూసే ఆలోచనలో ఉన్నారట. సినిమా ఆగష్టులో తీసుకురావడం కష్టమని తెలుస్తుంది. సినిమా అవుట్ పుట్ పై అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మెహర్ రమేష్ చేస్తున్నారు. షాడో తర్వాత చాలా ఏళ్లకు గానీ డైరెక్షన్ ఛాన్స్ అందుకున్న మెహర్ రమేష్ చిరు సినిమాతో ఫాం లోకి రావాలని చూస్తున్నారు.

Similar News