భలే మగాడు బాగానే వున్నాడు

Update: 2015-05-25 04:23 GMT
కబుర్లు చెప్పి కాలం మరిచిపోయేలా చేసే అబ్బాయిని సరదాగా భలే మగాడివోయ్ అంటుంటారు. నాని కూడా కబుర్ల రాయుడే. అందుకే తన సినిమాకి కూడా భలే భలే మగాడివోయ్ అనే టైటిల్ పెట్టుకున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఏవో కబుర్లు చెబుతూ తెగ నవ్వించేస్తున్నాడు. పరిచయమవ్వాలే కానీ మనోడు పిల్లలకీ జమీందారే.

మారుతి కొత్తజంట సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దర్శకత్వం చేస్తున్న సినిమా ఇది. టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్, ఇప్పుడిప్పుడే ఆ జాబితాలో చేరడానికి ప్రయత్నిస్తున్న యువి క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మళ్ళీ ఇది రాని రోజు తర్వాత గోపి సుందర్ ఈ తెలుగు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదో క్యూట్ లవ్ స్టొరీ అని ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. లవర్ బాయ్ గా నాని ఎంత బాగా మెప్పించగలడో అలా మొదలయింది, ఈగ సినిమాలు చూస్తె అర్థమయిపోతుంది. ఆ లెక్కన వరుస విజయాలు అందుకుంటున్న ఈ మగాడి ఖాతాలో ఇది కూడా మరో హిట్ చిత్రంగా మారే అవకాశం లేకపోలేదు.
Tags:    

Similar News