స్పెష‌ల్ స్టోరి: టాలీవుడ్ ఉత్త‌మ తండ్రులు

Update: 2019-06-16 07:33 GMT
ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా కుటుంబానికి స‌మ‌యం కేటాయిస్తూ.. కిడ్స్ తో ఆట‌లాడుకుంటూ మ‌న బిజీ హీరోలు ఫ్యామిలీ లైఫ్- ప‌ర్స‌న‌ల్ లైఫ్ మ్యాట‌ర్స్ ని డీల్ చేస్తున్న విధానం ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌కుండా ఉండ‌దు. ఎంత బిజీగా ఉన్నా షూటింగ్ ల‌ గ్యాప్ లో విదేశీ వెకేష‌న్లు ప్లాన్ చేస్తూ స్టార్ డాడ్స్ ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్ లు అని నిరూపిస్తున్నారు. ఆ కోవ‌లో టాలీవుడ్ హీరోల్లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అన్న‌ది ఆరా తీస్తే ఆద‌ర్శం అనిపించే డాడ్ ల సంగ‌తులు ఇవీ..

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ‌క్తు ఫ్యామిలీ మ్యాన్ గా.. బెస్ట్ డాడ్ గా పేరు తెచ్చుకున్నారు. చిన్నారులు గౌత‌మ్ - సితార‌తో క‌లిసి ఏడాదికి మూడు నాలుగు సార్లు అయినా విదేశీ వెకేషన్స్ కి వెళ్ల‌నిదే మ‌హేష్ కి నిదుర ప‌ట్ట‌దు. నిరంత‌రం ఏదో ఒక ట్రిప్ పేరుతో దుబాయ్ .. లండ‌న్.. ప్యారిస్ అంటూ వెళ్లి వ‌స్తుంటారు. ఇంట్లో ఉన్న‌ప్పుడు గౌత‌మ్ - సితార‌ల‌తోనే ఎక్కువ‌ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం త‌న క్యూట్ కిడ్స్ అల్లు అయాన్- అల్లు అర్హ‌ల‌తో క‌లిసి విదేశీ జాలీ ట్రిప్ ల‌కు వెళుతూ సెల‌బ్రేష‌న్స్ చేయ‌డం ప‌లుమార్లు రివీలైంది. ఇక ఇంట్లో ఉన్న‌ప్పుడూ బ‌న్ని త‌న కిడ్స్ తో ఆడుకుంటూ తీరిక స‌మ‌యాన్ని బోలెడంత ఆస్వాధిస్తుంటారు. ఆ ఫోటోలు ఇప్ప‌టికే యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. నిరంత‌రం అర్హ‌.. అయాన్ ల‌తో ఫోటోషూట్ల‌ను బన్ని షేర్ చేస్తుంటారు. ఫ్యామిలీ లైఫ్ ని వ్య‌క్తిగత జీవితంతో బ్యాలెన్స్ చేసే హీరోగా బ‌న్నికి గుర్తింపు ఉంది.

అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అంతే జోవియ‌ల్ గా కిడ్స్ తో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కిడ్స్ అభ‌య్ రామ్ .. భార్గ‌వ్ రామ్ ఇద్ద‌రితో ఎన్టీఆర్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు చాలా సంద‌ర్భాల్లో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. పిల్ల‌ల‌తో ప్ర‌త్యేక బాండింగ్ ఉన్న హీరోగా తార‌క్ కెమెరా కంటికి చిక్కారు ప్ర‌తిసారీ. ఇక వెకేష‌న్స్ పేరుతో తార‌క్ ఫ్యామిలీకి చాలా టైమ్ ని కేటాయిస్తుంటారు. నేచుర‌ల్ స్టార్ నాని క్యూట్ స‌న్ అర్జున్ గంటాతో క‌లిసి ఆడుకుంటున్న ఫోటోలు ఇన్ స్టాగ్ర‌మ్ .. ట్విట్ట‌ర్ వంటి చోట్ల వైర‌ల్ అయ్యాయి. స్టార్ల‌లో కూలెస్ట్ డాడ్ అని నానీ పేరు చెబుతారు. నాని త‌న‌ కుమారుడితో క‌లిసి ఆడుకుంటూ జోవియ‌ల్ గా ఉన్న ఫోటోల్ని అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తుంటారు. మంచు విష్ణు.. అల్ల‌రి న‌రేష్ .. గోపిచంద్ సైతం డాడ్ లు గా ప్ర‌మోటై ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయ‌డం అన్న‌ది చూస్తున్న‌దే.

ఇక సీనియ‌ర్ హీరోల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌- మ‌హేష్ .. మెగాస్టార్ చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్‌.. అల్లు అర‌వింద్ - అల్లు అర్జున్ - శిరీష్ .. కింగ్ నాగార్జున‌- నాగ‌చైత‌న్య - అఖిల్.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు- వ‌రుణ్ తేజ్.. మంచు మోహ‌న్ బాబు- విష్ణు- మ‌నోజ్.. మ‌మ్ముట్టి - దుల్కార్ స‌ల్మాన్.. చియాన్ విక్ర‌మ్ - ధృవ్..  వీళ్ల బాండింగ్ ఎంతో స్పెష‌ల్ అన్న సంగ‌తి తెలిసిందే.  (నేడు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్ స్టోరి)


Tags:    

Similar News