కౌబాయ్ లుక్కులో అదరగొడుతున్న 'అల్లుడు అదుర్స్' జోడి!!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మధ్య తన ఫ్యూచర్ సినిమాల పట్ల తెగ జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్ లో అల్లుడుశీను హిట్ తర్వాత వరుస హిట్లు దక్కలేదు. కెరీర్ చాలా స్లో అయింది. మొదటి సినిమా అల్లుడుశీనుతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా పెద్దగా బ్రేక్ రాలేదు. కానీ గతేడాది నటించిన సస్పెన్స్ సైకో థ్రిల్లర్ ‘రాక్షసుడు’ మాత్రం ఈ బెల్లంకొండ వారసుడికి మంచి కంబ్యాక్ సూపర్ హిట్ అందించింది. ప్రస్తుతం ఈ అల్లుడుశీను.. కందిరీగ, హైపర్ సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు ప్రారంభించారు మేకర్స్.
అయితే జనవరి 3న బెల్లంకొండ హీరో పుట్టినరోజు సందర్బంగా.. ఈ అల్లుడు అదుర్స్ సినిమాలో నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయనుంది చిత్రబృందం. 'ఓలా చిక్కా' అంటూ సాగే ఈ సాంగ్ లో శ్రీనివాస్ కౌబోయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. అలాగే హీరో సరసన హీరోయిన్ నభా నటేష్ కౌగర్ల్ లుక్కులో మెరిసిపోతుంది. ఇద్దరూ కూడా ఓలా చిక్కా పాటలో అల్ట్రా స్టైలిష్ లుక్కులో డాన్స్ ఆదరగొట్టారని టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన ఈ అల్లుడు అదుర్స్ ఆల్బమ్ పూర్తిగా డిఫరెంట్ ట్యూన్స్ తో అలరిస్తుందని మేకర్స్ తెలిపారు. ఇక ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లుడు శీను పక్కన బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ చిందెయ్యనుందని సమాచారం. అను ఇమ్మానుయేల్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.