• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బంగార్రాజు లో అయిదుగురు...

బంగార్రాజు లో అయిదుగురు అందగత్తెలు!

By - Tupaki Desk
Update: 2021-09-25 06:30 GMT
నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని పాత్ర బంగార్రాజు ను తీసుకుని దాని చుట్టు కథ అన్ని 'బంగార్రాజు' అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. నాగార్జున బంగార్రాజుగా కనిపించబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికి వస్తే మొదటగా కృతి శెట్టిని ఎంపిక చేయడం జరిగింది. ఆమె పూజా కార్యక్రమాలకు కూడా హాజరు అయ్యింది. అధికారికంగా ఆమెను యూనిట్‌ సభ్యులు అనౌన్స్ చేశారు. ఆమె కాకుండా ఈ సినిమాలో మరో నలుగురు అందగత్తెలు కూడా ఉంటారని యూనిట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ పాత్రను ఆమె కంటిన్యూ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రమ్యకృష్ణ ఉంటుందా లేదా అనే అనుమానాలు మొన్నటి వరకు వచ్చాయి. కాని ఆమె ఉంటుందనే అనధికారిక సమాచారం ఇటీవలే మీడియాకు అందింది.

రమ్యకృష్ణ మొదటి పార్ట్‌ లో అంత కాదు కాని చిన్న పాత్రలో బంగార్రాజులో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఆమె పాత్ర నిడివి తక్కువ ఉన్నా కూడా ఇరత హీరోయిన్స్ ఆ లోటును భర్తీ చేస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. స్వర్గంకు చెందిన సన్నివేశాలను ఈ సినిమాలో చిత్రీకరించబోతున్నారు. కథానుసారంగా కాస్త ఎక్కువ సమయమే స్వర్గం గురించిన సన్నివేశాలు ఉంటాయట. బంగార్రాజు భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా స్వర్గం నుండి వచ్చిన రంభ ఊర్వసి మేనకలు ఆయన వెంట ఉంటారట. అంటే ఆ ముగ్గురు సినిమాలో కీలకంగా ఎక్కువ సమయం కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. వారితో అక్కినేని హీరోలు చేయబోతున్న రొమాన్స్ సినిమా కు మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్ ను జోడించినట్లు అవుతుందని అంటున్నారు.

సినిమాలో కృతి శెట్టి మరియు రమ్యకృష్ణ లు మాత్రమే కాకుండా బిగ్ బాస్ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. ఈమె చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. కేవలం పాటలో వచ్చి పోయే పాత్ర మాత్రం కాదని చెబుతున్నారు. మోనాల్ తర్వాత వేదిక మరియు మీనాక్షి చౌదరిలలను కూడా ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. ఈ అయిదుగురు ముద్దుగుమ్మలు బంగార్రాజు వెయిట్‌ పెంచడంతో పాటు రంగులు అద్దడం ఖాయం అంటున్నారు. ఒక్కరు లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉంటేనే సినిమా కళ కళలాడుతూ ఉంటుంది. అలాంటిది బంగార్రాజులో ఏకంగా అయిదుగురు ముద్దుగుమ్మలు ఉండటం వల్ల ఖచ్చితంగా మంచి కలర్ ఫుల్ గా ఉంటుందనే నమ్మకంను అక్కినేని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ అయిదుగురు సినిమా ను వెలుగు వెలిగిస్తారనే నమ్మకం కలుగుతోంది.
Tags:    
  • Bangarraju 
  • Bangarraju movie 
  • Bangarraju release date 
  • Nagarjuna Bangarraju 
  • kriti shetty 
  • naga chaitanya 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS