నిన్నొదలా: మూడోసారి కరోనా బారిన పడిన బండ్ల గణేశ్
ఒకసారి కరోనా బారిన పడినోళ్లు మన చుట్టూ చాలామందే కనిపిస్తారు. రెండోసారి దాని బారిన పడినోళ్లు కొద్ది మంది కనిపిస్తారు. మరి.. మూడోసారి కూడా కొవిడ్ మహమ్మారి కాటుకుగురైనోళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. అందునా.. సెలబ్రిటీలు అస్సలు కనిపించురు. కానీ.. ఆ రికార్డును బద్ధలు కొట్టేశారు నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేశ్. తాను తాజాగా మరోసారి కరోనా బారిన పడిన విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
ఇప్పటికే రెండుసార్లు దాని బారిన పడిన ఆయన.. మూడోసారి కరోనా కాటుకు గురి కావటం షాకింగ్ గా మారింది. మొదటి దఫాతో పోలిస్తే.. రెండోసారి కరోనా బారిన పడిన సందర్భంగా ఆయన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందించారు. ఇలాంటి వేళ.. మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆయన.. మరేం జరిగిందో కానీ మూడోసారి ఆయన కరోనా బారిన పడ్డారు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆయన.. తాను కరోనా పాజిటివ్ అని తేలిందని..ఆదివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా.. మూడోసారి కరోనా బారిన పడినట్లుగా తేలిందన్నారు. ‘లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. నా కుటుంబ సభ్యులందరికి నెగిటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేయాలనుకునేవారు ఒకసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను.
ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి’ అని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
అదే సమయంలో తనకు పాజిటివ్ గా తేలిన రిపోర్టును ట్వీట్ కు జత చేశారు. అందరికి అన్ని జాగ్రత్తలు చెప్పే బండ్ల గణేశ్.. తాను మాత్రం అదే పనిగా కరోనా బారిన పడటం ఏమిటో? మిగిలినవారికి జాగ్రత్తలు తర్వాత.. ప్రస్తుతం ఆయన తనను తాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడిచిన వారంలో టాలీవుడ్ కు చెందిన పలువురు కరోనా బారిన పడటం తెలిసిందే. మొదటి రెండు వేవ్ లతో పోలిస్తే.. తాజా వేవ్ లో టాలీవుడ్ బాగా ఎఫెక్టు అవుతుందన్న మాట వినిపిస్తోంది.