త్వరలో 'పవర్ స్టార్'తో బండ్ల గణేష్ సినిమా రానుందా..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు పక్కనపెట్టి మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. రీఎంట్రీ కాకముందే వరుసగా చేతినిండా ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసాడు. వాటిలో ఒక్కొక్కటిగా పూర్తిచేస్తూ వస్తున్నాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాను కంప్లీట్ చేసాడు. భారీ అంచనాల నడుమ షూటింగ్ జరుపుకున్న వకీల్ సాబ్ మూవీ పై గట్టి నమ్మకంగా ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పవర్ స్టార్ మలయాళం 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ గా నటిస్తుండగా ఆయనకు పోటీగా రానా నటిస్తున్నాడు. అలాగే పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియడిక్ డ్రామా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేస్తానంటూ వార్తలలో నిలిచాడు బండ్ల గణేష్. పవన్ తో సినిమా చేయాలనేది అతని చిరకాల కోరికగా చెబుతుంటాడు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం దెబ్బతిన్నట్లు కనిపించినప్పటికీ.. బిజినెస్ పరంగా సంబంధాలు బాగానే ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే మొత్తానికి పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కానీ కేవలం దర్శకుడి విషయంలో సినిమా ఆగిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు దర్శకులు తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే చివరికి పూరి జగన్నాథ్ ఈ ప్రాజెక్టులో దర్శకుడిగా చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా బండ్ల ఆఫీస్ నుండి అధికారిక ప్రకటన రావచ్చని టాక్. ఇక ఇదివరకే పూరీ జగన్నాథ్ - బండ్ల కాంబినేషన్ లో ఇద్దరమ్మాయిలతో, టెంపర్ సినిమాలు రూపొందాయి. చూడాలి మరి మూడోసారి కాంబినేషన్ సెట్ అవుతారేమో!