నా ఊపిరి నీకు దాసోహం.. బండ్ల ఎమోషనల్ కవిత
``నా మాట.. నా బాట.. నీ కాడకే కదా నా దేవరా.. నా ఊపిరి నీకు దాసోహం.. నా తనువు నీకు దేవళం .. నా దేవరా..`` .. ఇదీ నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ కవిత.
అప్పుడప్పుడు అలా కాళిదాసులా కవిత్వం చెప్పనిదే బండ్ల గణేష్ కంటికి కునుకు పట్టదు. తన దేవర పవన్ కోసం బండ్ల కవితాత్మక హృదయం అస్సలు ఊరుకోదు. పవన్ అనే దేవుడి కోసం ఎన్నోసార్లు బండ్ల గణేష్ ఎన్నో త్యాగాలు చేశారు. అందుకే గణేష్ కు మాత్రం అతడు దేవర.
ఒక రకంగా పవన్ కోర్కెలు తీర్చే కలియుగ దైవం అని బండ్ల నమ్ముతాడు. అన్నట్టు గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ సినిమా తీసే అవకాశం రాలేదు గణేష్ కి. పవన్ ఆఫర్ ఇవ్వాలే కానీ వెంటనే తనతో ఓ సినిమా నిర్మించేందుకు వెయిటింగ్. అలాగని దేవరను సినిమా కోసం పొగిడాడు అనుకుంటే అంతకంటే తప్పు ఇంకొకటి ఉండదు. పవన్ ని జెన్యూన్ గా ఆరాధించే వీరాభిమానుల్లో బండ్ల మొట్టమొదటి వాడు. అదొక యజ్ఞం అతడికి. మెగాభిమానిగా పవనిజంలో అతడు ఏనాడో ఒక భాగం.