వామ్మో.. సుధీర్ పళ్ళు రాలగొడతా అన్న స్రిష్టి!

సుధీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్రిష్టి.. పళ్లు రాలగొడతా, పంచ్ ఇస్తా, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అంటూ మండిపడింది.

Update: 2026-09-22 03:56 GMT

బిగ్ బాస్ షో రెండో వారం లో స్రిష్టి పేలవ ప్రదర్శన ని ఎత్తి చూపుతూ నాగార్జున గట్టిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కృష్ణుడు తో పాటు స్రిష్టి కూడా డెంజర్ జోన్ లోకి వెళ్లి, తిరిగి హౌజ్ లోకి వచ్చింది. అయితే అది కావాలని చేసిందా తెలియదు, లేక ఎమోషన్ లో జరిగి పోయిందా తెలియదు కానీ ఈ మూడో వారం లో మాత్రం స్రిష్టి హైలైట్ గా నిలిచింది. తోటి కంటెస్టెంట్ సుధీర్ ని గుద్దు గుద్దుతా అని, పళ్ళు రాలగొడతా అని మాట్లాడుతూ పెద్ద రచ్చ చేసింది.

నామినేషన్స్ ప్రక్రియ లో భాగంగా, తనకు ఉన్న మరో నామినేషన్ అవకాశాన్ని రామ్ ప్రసాద్.. రోహిత్‌కు ఇచ్చాడు. సుధీర్‌ను నామినేట్ చేస్తూ, వర్షిణి నిన్ను కంట్రోల్ చేస్తోందని పాత విషయాలను ప్రస్తావించాడు రోహిత్. మధ్యలో స్రిష్టి ప్రస్తావన రావడంతో సుధీర్, స్రిష్టిల మధ్య పెద్ద గొడవ జరిగింది.

సుధీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్రిష్టి.. పళ్లు రాలగొడతా, పంచ్ ఇస్తా, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అంటూ మండిపడింది. సుధీర్ తన క్యారెక్టర్‌ను తప్పుబట్టేలా మాట్లాడుతున్నాడని, తాను అతనికి వెన్నుపోటు పొడిచానని అంటున్నాడని స్రిష్టి ఏడ్చేసింది. ఈ గొడవలోకి సుధీర్.. త్రిగుణ్‌ను లాగడంతో ఇద్దరూ కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత అమన్, సుధీర్‌ల మధ్య కూడా గొడవ నడిచింది.

నిజానికి స్రిష్టి తనతో ఫ్రెండ్షిప్ కట్ చేశా అని చెప్పగానే, సుధీర్ తనకి ఫ్రీడమ్ వచ్చింది అన్నట్టు కామెంట్స్ చేసాడు. గట్టిగా అడిగే సరికి, ఆ మాటలు స్రిష్టి ని ఉద్దేశించినవి కావు, త్రిగున్ మానిప్యులేషన్ నుంచి బయట పడుతున్నందుకు ఫ్రీడమ్ వచ్చింది అన్నట్లు మాట్లాడాడు. ఈ వ్యవహారాన్ని క్లారిటీ తో కాకుండా కన్ఫ్యూజన్ తో డీల్ చేయడం తో సుధీర్ విలన్ అవ్వడమే కాక స్రిష్టి చేత తిట్లు తిన్నాడు.

అయితే స్రిష్టి తిట్ల భాగోతం తో ఆపకుండా అతన్ని కొట్టాలనే ఉద్దేశ్యం తో మీదకి వెళ్ళింది కూడా. కానీ ఆమె ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలని అందరూ వచ్చి ఆపడంతో కాస్త శాంతించింది. ఈ విషయమై వీకెండ్ లో నాగార్జున కచ్చితంగా పెద్ద క్లాస్ పీకే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News