వ్వాటే ఎన‌ర్జీ.. వ్వాటే డ్యాన్సింగ్ స్టైల్.. ప్యార‌డైజ్ ప్రీరిలీజ్‌లో ఏకైక‌ షోస్టాప‌ర్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ `ది ప్యారడైజ్`.

Update: 2026-09-22 03:59 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ `ది ప్యారడైజ్`. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో బాలీవుడ్ యువ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ తన అద్భుతమైన స్టెప్పులతో వేదికను షేక్ చేశారు. ఈవెంట్ మొత్తానికి రాఘవ్ తన హై-ఎనర్జీ పర్ఫార్మెన్స్‌తో షోస్టాపర్‌గా నిలిచారు. ముఖ్యంగా సినిమాలోని `ఆయా షేర్` పాటకి అత‌డు వేసిన గ్రేస్ ఫుల్, పవర్ పుల్ స్టెప్స్ అక్కడి జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అత‌డు వేదిక‌పైకి ప్ర‌వేశిస్తూ చేసిన ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు .. స్టేజీపై యాంక‌ర్ సుమ ప‌విట కొంగుతో గిటార్ స్టెప్పు వేసి షోస్టాప‌ర్ గా నిలిచాడు. రాఘ‌వ్ వేదిక‌పై కి వ‌స్తుంటే వీక్ష‌కుల్లో పూన‌కాలు పుట్టుకొచ్చాయంటే అర్థం చేసుకోవ‌చ్చు.

రాఘవ్ జుయల్ డ్యాన్స్ శైలి ఎప్పుడూ ఎంతో యూనిక్‌గా ఉంటుంది. `కింగ్ ఆఫ్ స్లో-మోషన్`గా గుర్తింపు తెచ్చుకున్న అత‌డు ఈ వేదికపై హై-స్పీడ్ మూమెంట్స్ తో పాటు సడెన్ స్లో-మోషన్ స్టెప్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాఘ‌వ్ ఎనర్జీని చూసి ఇంప్రెస్ అయిన నేచురల్ స్టార్ నాని స్వయంగా రాఘవ్‌ను ప్రశంసిస్తూ.. అత‌డు భారతదేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరని కొనియాడారు. కేవలం డ్యాన్సర్‌గానే కాకుండా అత‌డిలోని పెర్ఫార్మర్ ఈ వేదికపై మరోసారి హైలైట్ అయ్యాడు.

ఈ సినిమాలో రాఘవ్ జుయల్ అత్యంత క్రూరమైన - పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నాని లాంటి మాస్ హీరోను ఢీకొట్టే విలన్‌గా త‌న‌ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. గతంలో రాఘవ్ బాలీవుడ్ చిత్రం `కిల్` లో చేసిన నెగెటివ్ రోల్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది.. మెప్పించింది కూడా. ఆ చిత్రంలో అత‌డి అభినయాన్ని చూసే డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఒడెల ఈ పాత్రకు రాఘవ్ అయితేనే పర్ఫెక్ట్ అని ఎంపిక చేసుకున్నారు. తన సహజమైన ఇంటెన్సిటీతో తెలుగు తెరపై రాఘ‌వ్ ఒక భీకరమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

కేవలం నటనపైనే కాకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి రాఘవ్ పడుతున్న కష్టం ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూనే ఈ సినిమా కోసం అత‌డు స్వయంగా తెలుగు భాష నేర్చుకుని.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కేవలం ఒక లాంగ్వేజ్‌కు పరిమితం కాకుండా పాన్-ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేయడానికి ఈ యువ‌న‌టుడు చేస్తున్న ప్ర‌య‌త్నం, అంకితభావం పరిశ్రమ వర్గాలను సైతం ఆకట్టుకుంటోంది.

డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా కెరీర్ ప్రారంభించి.. హోస్ట్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన రాఘవ్ జుయల్.. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల వైపు అడుగులు వేశారు. `ఎబిసిడి` సిరీస్ చిత్రాలతో నటుడిగా మారి ఆ తర్వాత `కిల్` వంటి ఇంటెన్స్ యాక్షన్ సినిమాలతో నటుడిగా తన పరిధిని విస్తరించుకున్నారు. ఇప్పుడు `ది ప్యారడైజ్` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రాఘవ్ జుయల్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మోస్ట్ వాంటెడ్ విలన్‌గా ప‌రిచ‌యం అవుతుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. రాఘ‌వ్ కి టాలీవుడ్ లో మంచి కెరీర్ ఉంద‌ని కూడా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈనెల 24న విడుద‌ల కానున్న ది ప్యార‌డైజ్ లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌ను వీక్షించేందుకు అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.





Tags:    

Similar News