• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోహ‌న్ బాబు ఇంపాక్ట్ ఏంటో...

మోహ‌న్ బాబు ఇంపాక్ట్ ఏంటో మ‌ళ్లీ చూస్తారు: `ది ప్యార‌డైజ్` వేదిక‌పై నాని!

| టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్`.

By - Sivaji Kontham
Update: 2026-09-22 04:12 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్`. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత వైభవంగా జరగగా.. ఈ వేదికపై ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు గురించి నాని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ వర్గాల్లో- సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా మోహన్‌బాబు కటౌట్.. ఆయన ఇంపాక్ట్ .. సినిమాలోని పాత్ర గురించి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోహన్‌బాబు గారు ఏంటి? ఆయన కటౌట్ ఏంటి? ఆయన ఇంపాక్ట్ ఏంటి? ఇవన్నీ `ది ప్యారడైజ్` సినిమా మరోసారి అందరికీ గుర్తు చేస్తుందని నాని పేర్కొన్నారు. తెలుగు సినిమా తరతరాలు మారుతున్నా.. మోహన్‌బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ .. ఆయన ప్రభావం ఎప్పటికీ ప్రత్యేకమేనని కొనియాడారు. ఈ చిత్రంలో ఆయన కనిపించే తీరు.. ఆయన క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ చూసి ప్రేక్షకులు క‌చ్చితంగా థ్రిల్ అవుతారని నాని ధీమా వ్యక్తం చేశారు.

అయితే బయట ప్రపంచంలో మోహన్‌బాబు గారి గురించి చాలామందికి ఒక అపోహ ఉందని నాని స్పష్టం చేశారు. ఆయనను చూసి చాలామంది కోపిష్ఠి అని అనుకుంటారు కానీ.. నిజ జీవితంలో ఆయనొక `వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్` అని నాని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తిగా తనకు ఆయన వ్యక్తిత్వం ఎంతగానో తెలుసని.. ఆయనొక ``అడోరబుల్ పర్సనాలిటీ``, ``గొప్ప హృద‌యం ఉన్న‌ స్వీట్‌హార్ట్`` అని ప్రశంసించారు. ఆయనతో పనిచేయడం తనకు ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని వెల్లడించారు.

ఇక ఈ చిత్రంలో మోహన్‌బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. ఈ సినిమాలో ఆయన `షికంజ మాలిక్` అనే పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ప్రత్యేకమైన గెటప్, హెయిర్‌స్టైల్ .. ఆయన ఎదురుగా వచ్చే జడల అప్పీయరెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని నాని తెలిపారు. తెరపై షికంజ మాలిక్ చేసే అల్లరిని, ఆయన హావభావాలను చూసి ప్రేక్షకులు థియేటర్లలో ఎంతగానో ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని నాని నమ్మకం వ్యక్తం చేశారు.

మొత్తానికి `ది ప్యారడైజ్` చిత్రంలో మోహన్‌బాబు నటన సినిమాకే హైలైట్‌గా నిలవనుందని నాని మాటల ద్వారా స్పష్టమైంది. ఒక లెజెండరీ నటుడి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. శ్రీకాంత్ ఒడెల టేకింగ్ కలగలిపి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ వేదికపై నాని మోహన్‌బాబును గౌరవించిన తీరు, ఆయనపై చూపిన అభిమానం ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంది.



మోహన్ బాబు గారు గురించి మా ఏజ్ గ్రూప్ వాళ్లకు ఆయన గురించి కొంత తెలుసు..

మా కంటే ముందు జనరేషన్ వాళ్లకు ఆయన క్రేజ్, ఆయన రేంజ్ ఇంకా బాగా తెలుసు!

మోహన్ బాబు గారు అంటే ఏంటి.. ఆయన కటౌట్ ఏంటి..#TheParadise ! కొత్త తరానికి చూపిస్తుంది!#Nani #MohanBabu #SrikanthOdela #TeluguCinema… pic.twitter.com/Sydr9Mdzz8

— Tupaki (@tupaki_official) September 21, 2026


Tags:    
  • nani 
  • mohanbabu 
  • theparadise 
  • srikanthodela 
  • tollywood 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

Copyright @2026

Powered by Blink CMS