ఒకప్పుడు స్టార్ హీరోల మూవీస్ కి క్యూ లో నిల్చొని చొక్కాలు చించుకునేవారు...ఆ ఫ్యాన్స్ అంత ఎటు పోయారు...
నలుగురు ఫ్రెండ్స్ కలిశారు అంటే అందులో ముగ్గురు సినిమా గురించే మాట్లాడుతుంటారు. చాలామంది సినిమాల గురించి క్యాజువల్ డిస్కషన్ పెడుతుంటారు.
నలుగురు ఫ్రెండ్స్ కలిశారు అంటే అందులో ముగ్గురు సినిమా గురించే మాట్లాడుతుంటారు. చాలామంది సినిమాల గురించి క్యాజువల్ డిస్కషన్ పెడుతుంటారు. కారణం ఏంటంటే ఎవరికి వాళ్లు వాళ్ల గురించి వాళ్ల ఫ్రెండ్స్ గురించి మాట్లాడిన తర్వాత ఇంకేం మాట్లాడాలో తెలియడం లేదు. దాంతో మిగిలిన మూడో ఆప్షన్ సినిమానే... ఎంటర్టైన్మెంట్ ని ఎక్కువ మోతాదులో అందించేది సినిమానే అందుకే చాలామంది దాని గురించే డిస్కషన్ పెడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే చాలా మంది స్టార్ హీరోల అభిమానులు మొదటి రోజే వాళ్ళ అభిమాన హీరో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు... ఇక ఇప్పుడు టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌకర్యం వచ్చింది కాబట్టి పర్లేదు కానీ ఒకప్పుడు సినిమా రిలీజ్ రోజు థియేటర్ల ముందు ఒక మినీ యుద్ధమే జరిగేది. థియేటర్ గేట్లు ఓపెన్ అవ్వకముందే చాలా పెద్ద క్యూ ఉండేది. టికెట్ల కోసం విపరీతంగా ప్రయత్నం చేసేవారు. స్టార్ హీరో సినిమాకి మొదటి రోజు టికెట్ దొరికిన వ్యక్తిని గ్రేట్ గా భావించేవారు. క్యూ లైన్ లో నుంచోని చుక్కలు చించుకొని మరి సినిమా టికెట్ ని దక్కించుకొని మొదటి రోజు మొదటి ఆటకు తమ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూసి కొన్ని వేల మంది ఎంజాయ్ చేసేవారు... ప్రస్తుతం అలాంటి రోజులు లేకుండా పోయాయి ఎవరైనా సరే టికెట్లు బుక్ చేసుకొని నీటుగా వెళ్లి సినిమాను చూసి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు రివ్యూ ఇచ్చేవారు కూడా లేరు.
ఎవరో ఒకరు ఇచ్చిన దానిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎందుకంటే సోషల్ మీడియా అప్పట్లో ఇంత యాక్టివ్ గా లేదు. కాబట్టి సినిమాని ఎవరైతే చూసి వస్తారో వాళ్ళ టాక్ ని బేస్ చేసుకొని మిగిలిన ప్రేక్షకులు సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. మౌత్ పబ్లిసిటి అప్పట్లో ఎక్కువగా ఉండేది. అందుకే చాలా సినిమాలు పెద్దగా స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన కూడా మౌత్ పబ్లిసిటి తో అడుతుండేవి. అప్పట్లో సినిమాలు 100 రోజులపాటు ఆడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మొదటి వారంలోనే సినిమా రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది. రెండో వారానికి వచ్చేసరికి సినిమా థియేటర్ నుంచి తీసేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు చొక్కాలు చించుకొని థియేటర్ క్యూ లైన్ లో నిలుచున్న అభిమానులందరు ఎటుపోయారు. వాళ్ళు ఇప్పుడు సినిమాలు చూడటం లేదా అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా కూడా ఒకప్పటి రోజులు చాలా గొప్పవనే చెప్పాలి. మొత్తానికైతే సినిమా అనేది ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడమే కాకుండా ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసేది. అందువల్లే ప్రేక్షకులందరు ఆ సినిమాలను చూస్తూ ఎంటర్ టైన్ అయ్యే వారు. సినిమా బాగుంది అంటే చాలు ఆ మూవీని ప్రతి ఒక్కరు ఎగబడి చూసేవాళ్ళు... ఇంకా కొంతమంది వరుసగా 4 షో లు చూసేవారు. అలాంటి రోజులు ఇప్పుడు వస్తే బాగుంటుందని సినిమా ఇండస్ట్రీ వాళ్లు సైతం కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబులు చేస్తూ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి థియేటర్ కి వచ్చి సినిమాలు చూసే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. కానీ జన్యున్ గా ఒక సినిమా బాగుంది అంటే మాత్రం తప్ప కుండా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఆ మూవీ సక్సెస్ లో వాళ్ళు కూడా ఒక భాగమవుతున్నారు...