సూర్య డైరెక్టర్స్.. ఇలా ప్లాన్ చేసుకుంటేనే..
ఒక స్టేజ్ లో యూత్, ఫ్యామిలీ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు రోల్ లో కొత్తదనం ఉంటేనే సినిమా చేయాలనే రేంజ్ కు వచ్చారు.
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే హీరో చుట్టూనే స్టోరీ తిరిగేది. ఇప్పుడు పరిస్థితి మారింది. హీరో ఎంత పెద్ద స్టార్ అయినా.. స్టోరీలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా సూర్య విషయంలో ఆ ఛేంజ్ మరింత క్లియర్ గా కనిపిస్తోంది. ఒక స్టేజ్ లో యూత్, ఫ్యామిలీ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు రోల్ లో కొత్తదనం ఉంటేనే సినిమా చేయాలనే రేంజ్ కు వచ్చారు.
ఇది కేవలం సూర్యలో వచ్చిన ఛేంజ్ కాదు. ఆయన సినిమాలను చూసే ప్రేక్షకుల్లో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూస్తే సరిపోయేది. ఇప్పుడు హీరో రోల్ కు ఏమైనా స్పెషాలిటీ ఉందా, కథలో కొత్త పాయింట్ ఏంటనే విషయాలను ప్రేక్షకులు అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే సూర్యతో సినిమా చేసే దర్శకులకు ఇప్పుడు మరింత కష్టంగా మారింది.
సూర్యకు సరిపోయే స్టోరీ రాయడం ఒక ఎత్తయితే.. ఆయనలో ఇప్పటివరకు చూడని యాంగిల్ ను బయటకు తీయడం మరో ఎత్తు. ఇదే ఇప్పుడు దర్శకుల ముందున్న అసలు టాస్క్. భారీ యాక్షన్ సీన్లు, పెద్ద సెట్లు, స్టార్ క్యాస్ట్ మాత్రమే సరిపోవు. వాటి వెనుక స్ట్రాంగ్ రోలో ఉండాలి. ఆ రోల్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కారణం ఉండాలి. సూర్య గత సినిమాల నుంచి కూడా ఒక విషయం అర్థమవుతుంది.
ప్రయోగం చేయడానికి ఆయన వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో తన స్టార్ ఇమేజ్ కు సరిపోయే కమర్షియల్ ఎలిమెంట్స్ వదులుకోవడం లేదు. అందుకే సూర్యతో పనిచేసే దర్శకులు ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేక్షకులకు ఇప్పటికే తెలిసిన సూర్యను మరోసారి చూపించకుండా.. కొత్త రోల్ లో ఉన్న సూర్యను చూపించాలి. హీరో ఎంట్రీకి వచ్చే హైప్ కంటే ఆ రోల్ కథలోకి ఎలా వస్తుంది, దాని జర్నీ ఎలా ఉంటుందనేదే ముఖ్యంగా మారింది.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఆయన ఏజ్, ఎక్స్పీరియన్స్. కెరీర్ స్ట్రార్టింగ్ లో చేసిన రోల్స్ ను ఇప్పుడు అదే విధంగా చేయడం పాజిబుల్ కాదు. ఇప్పుడు ఆయనలో ఉన్న ఎక్స్పీరియన్స్ ను రోల్స్ కు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. మెచ్యూర్డ్ పర్సన్ గా కనిపించే పాత్రలు, ఎమోషన్స్ కు ఎక్కువ స్థానం ఉన్న కథలు, వయసుకు తగ్గ కొత్త తరహా పాత్రలు సూర్యను మరో యాంగిల్ లో చూపించగలవు. అలాగే ఒకే దర్శకుడి ఫార్ములా మరో సినిమాకు పనిచేస్తుందని భావించడం కూడా ఇప్పుడు సరిపోదు.
ప్రతి సినిమాకు స్పెషల్ వరల్డ్ ను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సూర్య ఇమేజ్ ను యూజ్ చేసుకుంటూనే స్టోరీకి అవసరమైన చోట ఆయన స్టార్ పవర్ ను పెట్టాలి. అప్పుడే సినిమా హీరో మూవీ అనే రేంజ్ దాటి మంచి కథగా నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే అప్పటి సూర్యను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే ఇప్పుడు సరిపోదు. ఇప్పటి సూర్యను అర్థం చేసుకుని కథ రాయాలి. అప్పుడే సక్సెస్ అందుకోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి.