ప్యారడైజ్ ప్రీమియర్స్.. టైమింగ్ వెనుక ప్లాన్ ఏంటి?
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 24న ఆ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 24న ఆ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే నార్మల్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. టికెట్లు అమ్ముడవుతున్నాయి. కానీ ప్రీమియర్ షోల బుకింగ్స్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. దీంతో ఇప్పుడు సినిమా బుకింగ్స్ పై కాదు.. ప్రీమియర్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనే దానిపైనే అందరి ఫోకస్ ఉంది.
ది ప్యారడైజ్ స్పెషల్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 23వ తేదీ ఈవినింగ్ నుంచి వేయనున్నారు. అందుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాల నుంచి ఇప్పటికే స్పెషల్ షోలకు పర్మిషన్స్ వచ్చాయి. టికెట్ ధరలు కూడా ఫిక్స్ అయ్యాయి. తెలంగాణలో ప్రీమియర్ టికెట్ ధర రూ.500గా ఉండగా.. ఏపీలో మల్టీప్లెక్స్ లకు రూ.400, సింగిల్ స్క్రీన్లకు రూ.300గా డిసైడ్ చేశారు.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సాధారణ షోల బుకింగ్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. అవి ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అంటే ప్రేక్షకులు సెప్టెంబర్ 24 షోలకు తమ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ 23 ప్రీమియర్ షోలకు మాత్రం ఇంకా బుకింగ్ విండో తెరుచుకోలేదు. ఇదే ఇప్పుడు ప్యారడైజ్ టీమ్ ప్లానింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రీమియర్ షోలకు పర్మిషన్లు వచ్చిన తర్వాత కూడా వాటి బుకింగ్స్ ను వెంటనే ఓపెన్ చేయకుండా కొంత సమయం తీసుకోవడం వెనుక ఏదైనా స్పెషల్ ప్లాన్ ఉందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు చెన్నైలో మాత్రం ప్రీమియర్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. అంటే ప్రీమియర్ షోలకు సంబంధించిన బుకింగ్ ప్రాసెస్ అక్కడ ప్రారంభమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఆగి ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో తెలుగు మార్కెట్ కు సంబంధించి బుకింగ్స్ టైమింగ్ ను టీమ్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోందా అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు సాధారణ షోల కంటే వేరు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే ప్రేక్షకుల రెస్పాన్స్ మొదలయ్యే షోలు అవి. ముఖ్యంగా భారీ అంచనాలు ఉన్న సినిమాలకు ప్రీమియర్ బుకింగ్స్ కూడా రిలీజ్ హీట్ లో ఒక భాగంగా మారుతున్నాయి.
ఇప్పటికే సాధారణ షోల బుకింగ్స్ నడుస్తున్న సమయంలో ప్రీమియర్ బుకింగ్స్ ను వేరుగా హ్యాండిల్ చేయడం చూస్తుంటే.. ఇది కేవలం లేట్ మాత్రమేనా, లేక బుకింగ్స్ స్టార్ట్ చేసే టైమింగ్ విషయంలో ఏదైనా స్పెషల్ ప్లాన్ ఉందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి స్పెషల్ ప్రీమియర్ షోలకు షోలకు సంబంధించి బుకింగ్స్ ను మేకర్స్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్.