వైరల్ అవుతున్న బాలయ్య బర్త్ డే డీపీ.. ఫ్యాన్స్ సంబరాలు!

Update: 2020-06-06 03:30 GMT
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ నెల జూన్ 10న తన పుట్టినరోజును విశిష్టంగా జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజుకు ఎంతో ఎంతో విశిష్టత ఉందట. ఎందుకంటే ఈ పుట్టిన రోజుతో బాలయ్య 60వ యేటలోకి అడుగు పెట్టబోతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ జూన్ 10న బాలయ్య తన షష్టి పూర్తి మహోత్సవాన్ని కూడా జరుపుకుంటారని తెలుస్తుంది. మరి బాలయ్య పుట్టినరోజు అంటే అభిమానుల సంబరాలు మాములుగా ఉంటాయా.. అదిరిపోయే రేంజ్ లో ఏర్పాట్లు చేస్తున్నారట. బాలయ్య సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. అభిమానులు మాత్రం ప్రతి సినిమాను హై రేంజ్ లోనే రిసీవ్ చేసుకుంటారు.

జూన్ 10న బర్త్ డే అంటే పదిరోజుల ముందు నుండే హంగులు ఆర్భాటాలు చేయడానికి సిద్ధం అయిపోయారు. తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించి న్యూస్ వస్తేనే హడావిడి చేసే అభిమానులు మరి ఏకంగా హీరో బర్త్ డే అంటే ఏ స్థాయిలో సిద్దమవుతారో ఊహించుకోండి. ఇక తాజాగా నటసింహం బర్త్‌డే కి సంబంధించి అభిమానులు స్పెషల్ డీపీని విడుదల చేశారు. ఈ డీపీ రిలీజ్ కార్యక్రమంలో కొందరు ప్రముఖులు కూడా పాల్గొనడం విశేషం. ఇక ఈ స్పెషల్ డీపీ విషయానికి వస్తే.. బాలయ్య ఓ వైపు.. శ్రీకృష్ణదేవరాయలు గెటప్‌ లో.. మరో వైపు 'నిప్పురవ్వ' సినిమాలోని మాస్ రగ్గడ్ లుక్‌ లో గంభీరం గా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఆ రెండు ఫోటోల వెనుక జై బాలయ్య, హిందూపూర్, బసవతారకం వంటి పదాలతో పాటు బాలయ్య తల్లిదండ్రుల బొమ్మలు కూడా ఎడిట్ చేశారు. మరో స్పెషల్ ఏంటంటే.. ''ఆయనకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వెల్తారు ఏమో, అయిన వాళ్ళకి వస్తే మాత్రం అరక్షణం కూడా ఆలోచించరు..'' అనే బాలయ్య ఫేమస్ డైలాగ్ తో డీపీ విడుదల చేశారు అభిమానులు. ప్రస్తుతం బాలకృష్ణ బర్త్‌డే డీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక వరుస పరాజయాల పాలైన బాలయ్య ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా చేస్తున్నాడు.
Tags:    

Similar News