బాలయ్య ‘రామారావు’ ఇంట్రెస్టింగ్ అప్డేట్
గత సంక్రాంతికి ఎఫ్ 2 చిత్రంతో.. మొన్నటి సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన దర్శకుడు అనీల్ రావిపూడి. ఈయన ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. అంతా సాఫీగా ఉంటే ఈ ఏడాదిలో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 తెచ్చేవాడేమో. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా వచ్చే ఏడాది ఆరంభంలో ఎఫ్ 3 ని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎఫ్ 3 చిత్రం తర్వాత బాలయ్యను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
అనీల్ రావిపూడి ‘పటాస్’ చిత్రానికి ముందే బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాడు. పటాస్ తర్వాత ‘రామారావు’ అనే స్క్రిప్ట్ ను బాలకృష్ణకు వినిపించాడని దిల్ రాజు ఆ సినిమాను నిర్మించేందుకు ఆసక్తి కనబర్చాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల బాలయ్య ఆ సమయంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయలేక పోయాడట. ఎట్టకేలకు ఇప్పుడు అనీల్ రావిపూడితో సినిమాకు నందమూరి హీరో ఓకే చెప్పాడు. గతంలో చెప్పిన రామారావు స్క్రిప్ట్ తోనే కొన్ని మార్పులు చేసి వెళ్లాలనే నిర్ణయానికి బాలయ్య వచ్చాడట.
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ చిత్రం తర్వాత బి గోపాల్ దర్శకత్వం లో ఒక సినిమాను చేయాలని భావిస్తున్నాడట. ఆ రెండు సినిమాల తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో అనీల్ రావిపూడి మూవీ షురూ అయ్యే అవకాశం ఉంది. దర్శకుడు అనీల్ రావిపూడి ఫిల్మ్ మేకింగ్ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటాడు. సరిలేరు నీకెవ్వరు కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేసిన విషయం తెల్సిందే. అలాగే బాలయ్య ‘రామారావు’ ప్రాజెక్ట్ ను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేయవచ్చు అంటున్నారు.