• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాస్టల్ లో జై...

హాస్టల్ లో జై బాలయ్యా..అంటూ హంగామా

By - Tupaki Desk
Update: 2017-08-19 11:25 GMT
‘పైసా వసూల్’ ట్రైలర్ చూస్తే మొత్తం నందమూరి బాలకృష్ణే కనిపించాడు. ఆరంభం నుంచి చివరి దాకా బాలయ్యే హైలైట్ అయ్యాడు. బాలయ్య ఎనర్జీ.. ఆయన డైలాగులు ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు వచ్చిన స్టంపర్లో సైతం బాలయ్య విశ్వరూపమే కనిపించింది. బాలయ్య నెవర్ బిఫోర్ అవతారంలో.. క్యారెక్టర్లో కనిపిస్తున్న ‘పైసా వసూల్’ నందమూరి అభిమానులకు విందు భోజనమే అయ్యేలా కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు కొంచెం కంగారు పెట్టిస్తున్నప్పటికీ.. ‘పైసా వసూల్’ అభిమానుల వరకు పైసా వసూల్ అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పైసా వసూల్’ ట్రైలర్ విషయంలో ఓవరాల్ ఫీడ్ బ్యాక్ ఓ మోస్తరుగా అనిపిస్తుంటే.. బాలయ్య అభిమానులు మాత్రం సినిమా పట్ల చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఫ్యాన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ లోనూ ఈ ట్రైలర్ బాగానే ఆసక్తి రేకెత్తించినట్లు కనిపిస్తోంది.

మొన్న ట్రైలర్ రిలీజైన సందర్భంగా గుంటూరు దగ్గర్లోని కేఎల్ యూనివర్శిటీ హాస్టల్లో కుర్రాళ్ల హంగామా చూస్తే.. నందమూరి అభిమానులకే కాక సామాన్య ప్రేక్షకులకూ బాలయ్య 101 ఫీవర్ ఎక్కేసిందేమో అనిపిస్తోంది. భారీ భవంతుల్లో ఉన్న ఆ హాస్టల్ ప్రాంగణంలోని కుర్రాళ్లందరూ ‘పైసా వసూల్’ ట్రైలర్ చూసిన అనంతరం జై బాలయ్యా జైబాలయ్యా అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ హాస్టల్ ను హోరెత్తించేశారు. ఆ హంగామాను వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. అది ‘పైసా వసూల్’ దర్శకుడు పూరి జగన్నాథ్ వరకు వచ్చింది. దాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నాడు పూరి. ఈ వీడియో నందమూరి అభిమానుల్లో సంతోషం నింపుతోంది.

Full View
Tags:    
  • Balakrishna 
  • Paisa Vasool 
  • KL University 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS