ఎన్టివోడి స్టైల్లో బాలయ్య చిలక్కొట్టుడు!
క్రిష్ అండ్ టీమ్ జోరుగా ప్రమోషన్స్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే జనాల్లోకి చొచ్చుకుపోయింది. సంక్రాంతి సీజన్ సినిమాల్లో ఈ రేంజ్ ప్రమోషన్స్ ఇతర సినిమాలకు లేదంటే అది అతిశయోక్తి కాదు. విడుదలకు కౌంట్ డౌన్ 24 గంటల కంటే తక్కువగా ఉన్నా ఇప్పటికీ ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో మరింతగా హైప్ ను పెంచుతున్నారు. తాజాగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' టీమ్ బాలయ్య - హన్సిక ల డ్యాన్స్ మూమెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అన్నగారి సినిమాలలో 'యమగోల' కు ప్రత్యేక స్థానం ఉంది. యముడు.. యమలోకం నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కే సినిమాలు అసలు టాలీవుడ్ లో 'యమగోల' తోనే మొదలయ్యాయి. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలవడమే కాకుండా పాటలన్నీ చార్ట్ బస్టర్లయ్యాయి. వాటిలో 'చిలక కొట్టుడు' పాట ఓ క్లాసిక్. ఇప్పుడు 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాకోసం ఆ పాటకు ఎన్టీఆర్.. జయప్రద గెటప్పులలో బాలయ్య.. హన్సిక స్టెప్పులేశారు. పైనున్న పోస్టర్ ఈ పాటలోనిదే.
పొడుగు కాలర్ ఉండే ఎల్లో షర్టు.. గ్రే కలర్ బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకున్న బాలయ్య 70 ల స్టైల్ లో పెద్ద కొప్పుతో కలర్ఫుల్ శారీతో రెడీ అయిన హన్సికను చిలిపిగా ఏడిపిస్తూ డ్యాన్స్ వేస్తున్నాడు. హన్సిక కాలుకు తన కాలు అడ్డం పెట్టి నాటు సరమాడుతూ నవ్వుతున్నాడు. ఇద్దరూ రెట్రో లుక్ లో ఉండడంతో పోస్టర్ మహా డిఫరెంట్ గా ఉంది. ఈ పాటకు బాలయ్య వేరెవరికీ సాధ్యంకానీ అన్నగారి తరహా స్టెప్పులేస్తే థియేటర్లలో యమ గోలే.. యమా యమా గోలే..!