బాహుబ‌లి మ‌నోహ‌రి సొంత డ్యాన్స్ అకాడెమీ

Update: 2021-02-27 16:30 GMT
బాహుబ‌లి మ‌నోహ‌రిగా తెలుగు వారి గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయింది నోరా ఫ‌తేహి. బాలీవుడ్ స‌హా సౌత్ లోనూ చెప్పుకోద‌గ్గ ఐటెమ్ నంబ‌ర్ల‌లో న‌ర్తించిన ఈ బ్యూటీ డ్యాన్సుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు.ఇక ఇదే అద‌నుగా నోరా తన సానుకూలతను విస్తృతంగా విస్తరించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నుకుంటున్నార‌ట‌. నోరా ఫతేహి ప్రతిభావంతుల‌ అభ్యున్నతి కోసం సొంతంగా ఒక డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతిభావంతులను ప్రోత్స‌హించ‌డ‌మే ధ్యేయంగా నోరా ఫతేహి తన స్ఫూర్తిదాయకమైన ప్ర‌య‌త్నం ప్రారంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నోరా ఒక డ్యాన్సింగ్ దేవ‌త‌.. ఐకాన్. ప్రపంచ వ్యాప్తంగా  ప్ర‌తిభ‌ను ప్రోత్సహించడం అనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుందిట‌. ఔత్సాహిక కళాకారులకు మద్దతుగా ఒక అకాడమీని ఏర్పాటు చేస్తానని నోరా ఫతేహి ప్రతిజ్ఞ చేశారు.తన అభిమానులు అనుచరుల ప్రేమ ప్రశంస‌లే త‌న‌ విజయానికి కారణమ‌ని నోరా ఫతేహి ఆనందం వ్య‌క్తం చేసారు.  అలాగే తన అకాడమీని ప్రారంభించడం ద్వారా అభిమానుల‌కు తిరిగి మద్దతును ఇవ్వాల‌న్న‌దే త‌న ఉద్ధేశ‌మ‌ని అన్నారు.

మ‌నం బాగా ప్రతిభ‌ను ప్ర‌ద‌ర్శించిన‌పుడు ప్రేక్షకులు  కోరుకుంటున్నారు. ప్రేమిస్తారు కాబట్టి ఈ ఫీల్డ్ లో ఇంతకంటే విలువైనది .. శక్తివంతమైనది ఏదీ లేదు. ప్రేక్షకులు మేము నిన్ను కోరుకుంటున్నామని చెప్తుంటే మేం ఆనందిస్తాం. నా పాటలు సంఖ్య బాగుంది. పిల్లలు ఇంటర్నెట్ ‌లో నా హుక్ స్టెప్ చేస్తున్నప్పుడు..నోరా మామ్ అని నన్ను ట్యాగ్ చేస్తూ నన్ను మీలాగే డాన్స్ చేయనివ్వండి అని అడిగితే.., నేను ఇంరా ఎలామి చేయగలను చూడండి.. అని ట్యాగ్ చేస్తే, అది చాలా అందమైన అనుభూతి. అందుకే  నేను నా స్వంత అకాడమీ బ్రాండ్ ను ప్రారంభించాల‌నుకుంటున్నాను .. అని తెలిపింది.

స్ట్రీట్ డాన్సర్ 3 డి నాచ్ మేరీ రాణి.. చోర్ డెంగే వంటి చార్ట్ బస్టర్ ‌లతో బ్యాక్ టు బ్యాక్ విజయం అందుకున్న నోరా.. ఇండ‌స్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన డ్యాన్స‌ర్ గా రాణించారు. భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాతో సహా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్నారు.
Tags:    

Similar News