• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్‌ టాక్ : స్నేహం...

ట్రైలర్‌ టాక్ : స్నేహం ప్రేమ కోసం బడవ రాస్కెల్‌

By - Tupaki Desk
Update: 2022-02-17 10:20 GMT
తెలుగు లో ఇప్పటి వరకు ఎక్కువగా తమిళం సినిమాలు ఎక్కువగా డబ్‌ అయ్యాయి. ఆ తర్వాత మలయాళం సినిమాలు కూడా కొన్ని డబ్బింగ్ అయ్యాయి. కాని కన్నడ సినిమాలు చాలా తక్కువగా డబ్బింగ్‌ అయ్యాయి. కన్నడ మూవీ కేజీఎఫ్ తర్వాత అక్కడ మంచి క్రేజ్ దక్కించుకున్న సినిమాలను ఇక్కడ డబ్బింగ్‌ చేయడం చేస్తున్నారు. వరుసగా కన్నడ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఆ క్రమంలోనే ఈనెల 18న బడవ రాస్కెల్‌ అనే సినిమా విడుదల కాబోతుంది. కన్నడంలో గత ఏడాది డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ పది రోజుల్లోనే 16 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ధనంజయ్‌ హీరోగా అమృత మరియు వాసుకి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ను తెలుగు లో భారీగా ప్రమోట్‌ చేస్తున్నారు.

పుష్ప సినిమా లో ధనంజయ్ కీలకమైన జాలిరెడ్డి పాత్రలో నటించి ఇప్పటి కే తెలుగు లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. పుష్ప సినిమా సెన్షేషనల్‌ సక్సెస్ దక్కించుకోవడంతో పాటు జాలీ రెడ్డి పాత్ర గురించి ప్రముఖంగా ప్రచారం జరిగిన కారణంగా బడవ రాస్కెల్‌ సినిమా కు మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది అనడంలో సందేహం లేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ చేతుల మీదుగా విడుదల చేయించారు.

ట్రైలర్‌ లో హీరో పాత్ర ను రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరో పాత్ర తరహాలో చూపించారు. స్నేహితులు మరియు లవర్ మద్య నలిగే పాత్రలో హీరో కనిపించాడు. తన ప్రేమ కావాలంటే స్నేహితులను వదిలేయాలంటూ ప్రేయసి కండీషన్ పెట్టడం ట్రైలర్‌ లో చూడవచ్చు. సినిమాలో స్నేహం కు హీరో చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. అదే సమయంలో ప్రేయసి దూరం అవ్వడంతో దుఃఖం లో మునిగి పోతాడు.

స్నేహం మరియు ప్రేమ కోసం ఆరటపడే హీరో పాత్రలో ధనంజయ కనిపించబోతున్నాడని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. పుష్ప సినిమాలో జాలి రెడ్డి పాత్రలో చాలా రఫ్‌ పాత్రలో కనిపించిన ధనంజయ ఈ సినిమాలో మాత్రం చాలా కూల్‌ గా కమర్షియల్‌ హీరో లుక్ లో కనిపిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ను ఆధరిస్తారు అనే నమ్మకంతో మేకర్స్‌ భారీ రిలీజ్ కు ప్లాన్‌ చేశారు.



Full View
Tags:    
  • Badavarascel 
  • dollydhanujay 
  • pushpa 
  • alluarjun 
  • ramgopalvarma 
  • trailer 
  • tollywood 
  • latestnews 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS