• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2020 లో రాశీని ఆప‌డం...

2020 లో రాశీని ఆప‌డం నీత‌ర‌మా

By - Tupaki Desk
Update: 2019-12-27 06:11 GMT
దిల్లీ బ్యూటీ రాశీఖ‌న్నా కు ఇన్నాళ్లు స‌రైన స‌క్సెస్ లేదు. అవ‌కాశాలైతే వ‌చ్చాయి గానీ చెప్పుకోద‌గ్గ విజ‌యాలైతే ద‌క్క‌లేదు. కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లు గ‌డుస్తున్నా.. ఎక్క‌డ వేసిన గోంగ‌లి అక్క‌డే అన్న చందంగా గ‌డిచింది. అయితే ఇది నిన్న‌టి మాట‌. 2019 రాశీ ద‌శ తిప్పేసింది. ఇటీవ‌లే రెండు బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు ఖాతా లో వేసుకుంది. వెంకీమామ లో నాగ‌చైత‌న్య‌కు జోడీగా.. విలేజ్ గాళ్ పాత్ర‌ లో మెప్పించగా.. ప్ర‌తి రోజు పండ‌గే చిత్రంలో టిక్ టాక్ భామ‌గా ఆడియ‌న్స్ కు మ‌రింత రీచ్ అయింది. రెండు చిత్రాల్లో అమ్మ‌డి పాత్ర‌ కు మంచి గుర్తింపు ద‌క్కింది. రెండు చిత్రాల్లోనూ తన పాత్ర‌ల‌కు తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకుని స‌క్సెస్ అయింది.

దీంతో మునుపెన్న‌డూ త‌న‌ని ప‌ట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు త‌న మాటే ఎత్తుతున్నారు. ఆడియ‌న్స్ ఇప్పుడు రాశీ గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లు పెట్టారు. హీరోయిన్ గా స‌క్సెస్ అయింది అని చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా ఏం కావాలి? అంటే టాలీవుడ్ లో రాశీ ద‌శ మారిన‌ట్లేన‌ని సంకేతాలు అందుతున్నా యి. ప్రస్తుతం రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` లో న‌టిస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో రాశీ పాత్ర హైలైట్ గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం వేడెక్కిస్తోంది. రౌడీ స్టార్ ఇమేజ్..ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ కాన్ఫిడెన్స్ న‌డుమ రాశీ ఖాతాలో హ్యాట్రిక్ ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కె. ఎస్ రామారావు ప్ర‌తిష్టాత్మ‌కం గా నిర్మిస్తున్నారు.

అటు కోలీవుడ్ ను విడిచి పెట్ట‌లేదు ఈ బ్యూటీ. టాలీవుడ్ త‌ర‌హాలోనే త‌మిళం లోనూ రాశీ రేంజ్ అంతంత మాత్ర‌మే. అయినా ఎక్క‌డా ఆత్మ విశ్వాసం స‌డ‌ల‌కుండా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం సిద్దార్థ్ స‌ర‌స‌న సైతాన్ కా బ‌చ్చా అనే ఓ చిత్రంలో న‌టిస్తోంది. హాలీవుడ్ సినిమా `స‌న్నాఫ్ ఆఫ్ ది డెవిల్` ని స్ఫూర్తిగా తీసుకుని తెర‌కెక్కిస్తున్నారు. అలా రాశీ కెరీర్ సాగిపోతోంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే రాశీ న‌టించిన రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.
Tags:    
  • Raashi Khanna Movies 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS