బాహుబలి.. ఈ వీడియో చూసి తీరాల్సిందే

Update: 2015-08-30 10:23 GMT

Full View
తెరమీద భారీ జలపాతం కనిపిస్తుంది. పెద్ద పెద్ద కొండలుంటాయి. హీరో హీరోయిన్ ని అందుకోవడానికి ఒక కొండ మీది నుంచి ఇంకో కొండ మీదికి దూకేస్తాడు. జలపాతం మీదుగా విన్యాసాలు చేస్తాడు. హీరోయిన్ నీటి మీద తేలియాడుతూ వెళ్లిపోతుంది. ఇలా కళ్లు మిరుమిట్లు గొలిపే ఎన్నెన్నో అద్భుతమైన దృశ్యాలు ‘బాహుబలి’లో చూపించాడు రాజమౌళి. కానీ తెరమీద కనువిందు చేసే జలపాతం అబద్ధం.. భీతిగొలిపే ఆ కొండలు అబద్ధం. హీరో విన్యాసాలూ అబద్ధం. తెరమీద కనిపించేదంతా కూడా ఓ అబద్ధపు ప్రపంచం. కానీ ఆ అబద్ధాన్ని నిజమనుకునేలా భ్రమింపజేసిన నైపుణ్యం.. విజువల్ ఎఫెక్ట్స్ టీందే. వీఎఫ్ ఎక్స్ మైనస్ చేసి చూస్తే ‘బాహుబలి’ నథింగ్ అని చెప్పాలి.

మరి ఈ ఎఫెక్టుల తాలూకు క్రెడిట్ ఎవరిది? ప్రధానంగా ‘మకుట’ అనే సంస్థది. సినిమాలో మెజారిటీ వీఎఫ్ ఎక్స్ చేసింది మకుట సంస్థే. ఇంతకుముందు రాజమౌళి ‘ఈగ’లోనూ మకుట వాళ్లు తమ నైపుణ్యం చూపించారు. బాహుబలిలోనూ 50 శాతం వీఎఫ్ ఎక్స్ క్రెడిట్ వాళ్లదేనంటూ ట్విట్టర్ లో ఓ వీడియో పెట్టాడు రాజమౌళి. నార్మల్ గా ఉన్న బ్యాగ్రౌండ్ ను విజువల్ ఎఫెక్టుల ద్వారా ఎలా కళ్లు చెదిరేలా మార్చారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో మకుట వాళ్లు మ్యాజిక్ చేసిన తీరు ఈ వీడియోతో అర్థమవుతుంది. ఈ వీడియో చూశాక.. భలేగా మాయ చేశారే అనిపించడం ఖాయం.
Tags:    

Similar News