ఏపీ పాలిటిక్స్.. పవన్ కు యంగ్ హీరోల బిగ్ సపోర్ట్!

అయితే ఏపీలో ఓవైపు రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ చూస్తోంది.

Update: 2024-05-07 11:06 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో లోకసభ తోపాటు అసెంబ్లీకి కూడా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు అంతా ప్రచారంలో మునిగిపోయారు. ఎన్నడూ లేనంతగా సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నా.. తగ్గేదేలే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల మద్దతు కోసం తహతహలాడుతున్నారు. తమను గెలిపించాలని కోరుకుంటున్నారు.

అయితే ఏపీలో ఓవైపు రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ చూస్తోంది. మరోవైపు టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వరుసగా బహిరంగ సభలు నిర్వహించి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇక పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని ఫిక్స్ అయ్యారు. తనతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

ఇప్పటికే పవన్ కు మద్దతుగా మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. తమ అంకుల్ ని గెలిపించాలని ఓటర్లను కోరారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను కూడా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ ను గెలిపించాలని సోషల్ మీడియాలో మంగళవారం ఉదయం వీడియో పోస్ట్ చేశారు. తనకంటే జనాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం పవన్ ది అని చెప్పారు.

Read more!

ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన పలువురు యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతున్నారు. నేచురల్ స్టార్ నాని పవన్ కు మద్దతు ప్రకటించారు. సినిమా కుటుంబసభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరో యంగ్ హీరో రాజ్ తరుణ్.. కూడా జనసేనానికి సపోర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మంచి కోసం పవన్ చేస్తున్న ప్రయత్నాలను తొలి రోజు నుంచి చూస్తున్నట్లు తెలిపారు.

మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నట్లు రాజ్ తరుణ్ ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన కోరారు. 'ఇప్పటి జనాలకు నువ్వు కావాలి' అనే ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఈ ట్యాగ్.. నెట్టింట ట్రెండ్ అవుతోంది. అలాగే పవన్‌ కు మద్దతు తెలుపుతున్నట్లు యువ నటుడు తేజ సజ్జా తన ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. మరి పవన్ ఎలాంటి విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News