• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘మెగా’ బ్రాండుకు బాహుబలి...

‘మెగా’ బ్రాండుకు బాహుబలి పంచ్

By - Tupaki Desk
Update: 2017-05-12 06:00 GMT
చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాక ఇండస్ట్రీ రికార్డులన్నీ ఎప్పటికప్పుడు ఆయన పేరు మీదే ఉంటుండేవి. ఎవరైనా ఆ రికార్డుల్ని బద్దలు కొట్టినా.. వాటిని మళ్లీ చిరునే బద్దలు కొట్టేవాడు. చిరు ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించడాని కంటే ముందే పవన్ పీక్స్ అందుకుని అతనూ రికార్డుల మోత మోగించడం మొదలుపెట్టాడు. మరోవైపు రామ్ చరణ్.. అల్లు అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ల స్థాయిలో వాళ్లు హవా సాగించడం మొదలుపెట్టారు. దీంతో చిరు ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించినా మెగా ఫ్యామిలీ ఆధిపత్యానికి ఢోకా లేకపోయింది. మగధీర.. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాయి. కానీ దశాబ్దాలుగా సాగుతున్న మెగా ఫ్యామిలీ హవాకు ‘బాహుబలి’ వచ్చి బ్రేక్ వేసేసింది. ‘బాహుబలి’ రెండు భాగాలూ కొత్త చరిత్రను లిఖించాయి.

‘బాహుబలి: ది బిగినింగ్’ డే-1 కలెక్షన్ల రికార్డుతో పాటు కొన్ని ఏరియాల్లో ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్లను ‘ఖైదీ నెంబర్ 150’ బద్దలు కొట్టిందని మెగా అభిమానులు సంబరపడినా.. ఆ సంబరం ఎన్నో రోజులు నిలవలేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చి మెగా ఫ్యామిలీ టచ్ చేయలేని రికార్డులకు తెర తీసింది. ఇది మెగా ఫ్యామిలీ ఆధిపత్యానికి సవాలే. ‘బాహుబలి’ వల్ల ‘మెగా’ బ్రాండు దెబ్బ తిన్న నేపథ్యంలో మళ్లీ తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నంలో పడింది ఆ ఫ్యామిలీ. ఓవైపు చిరంజీవి హీరోగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లాంటి చారిత్రక నేపథ్యమున్న సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మరోవైపు అల్లు అరవింద్ రూ.500 కోట్లతో రామాయణం అంటున్నాడు. ఈ సినిమాలు మెగా ఫ్యామిలీ ఆధిపత్యాన్ని మళ్లీ చాటిచెబుతాయని.. ‘బాహుబలి’ జనాల దృష్టిని మళ్లిస్తాయని ఆశిస్తున్నారు. మరి వాళ్ల ఆశ నెరవేరుతుందేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Baahuabali 2 
  • Mega Heroes 
  • Tollywood 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS