• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవసరాల-నాని.. ఒక...

అవసరాల-నాని.. ఒక థ్రిల్లర్

By - Tupaki Desk
Update: 2017-05-05 11:14 GMT
అవసరాల శ్రీనివాస్ నటుడిగా ఎంత మంచి పేరు సంపాదించాడో.. దర్శకుడిగా కూడా అంతే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే.. జ్యో అచ్యుతానంద సినిమాలు అతడి అభిరుచిని చాటిచెప్పాయి. ఈ తరం తెలుగు ప్రేక్షకులకు అతణ్ని బాగా దగ్గర చేశాయి. అవసరాల మూడో సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జ్యో అచ్యుతానంద’ చేసే సమయంలోనే అవసరాల.. తన మిత్రుడు నానితో సినిమా చేయడానికి హామీ ఇచ్చాడు. వారాహి చలనచిత్రం ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. ఐతే ఇందుకోసం ముందే ఓ లైన్ అనుకున్న అవసరాల.. తర్వాత మనసు మార్చుకున్నాడు. మధ్యలో నాని చేసిన సినిమాలు చూశాక తన ఆలోచన మారిందని.. పాత కథను పక్కనబెట్టేసి కొత్త లైన్ ఆలోచిస్తున్నట్లు చెప్పాడు అవసరాల.

తాజాగా ‘బాబు బాగా బిజీ’ ప్రమోషన్లలో భాగంగా తన దర్శకత్వంలో రాబోయే తర్వాతి సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం స్క్రిప్టు ఓ కొలిక్కి వచ్చే దశలో ఉందని చెప్పాడు. ఈసారి తన గత సినిమాలకు భిన్నంగా థ్రిల్లర్ కథాంశంతో సినిమా చేయబోతున్నానని అతను చెప్పాడు. ప్రేక్షకులకు ఈసారి కొత్త అనుభూతిని పంచుతానని అతనన్నాడు. నాని చేసిన ‘జెంటిల్ మన్’ తరహాలో ఇది కూడా భిన్నంగా ఉంటుందన్నాడు. ఇంకో నెల రోజుల్లోపు పూర్తి స్క్రిప్టు రెడీ అవుతుందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని అన్నాడు అవసరాల. తన డైరెక్షన్లో కొత్త సినిమా మొదలయ్యాక.. నటనకు విరామం ఇస్తానని చెప్పాడు. మరి నాని లాంటి క్రేజీ హీరోతో పని చేయబోతున్న అవసరాల ఈసారి ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Avasarala Srinivas 
  • Nani 
  • Telugu NEWs 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS