• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుకుమార్ కు థ్యాంక్స్...

సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పిన దిల్‌ రాజు వారసుడు

By - Tupaki Desk
Update: 2022-06-17 09:30 GMT
ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా రౌడీ బాయ్స్‌ తో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌ రెడ్డి మొదటి ప్రయత్నంలోనే నటుడిగా పాస్ అయ్యాడు. కమర్షియల్ గా కూడా ఆ సినిమా సక్సెస్ గా నిలిచింది అంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ రౌడీ బాయ్ అశ్విన్ రెడ్డి రెండవ సినిమా 'సెల్ఫిష్‌' ప్రయత్నాల్లో ఉన్న విషయం తెల్సిందే.

రెండవ సినిమా బాధ్యతలను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ భుజాన వేసుకున్నట్లుగా తెలుస్తోంది. విశాల్ ఖాసి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే మరియు డైలాగ్స్ ను సుకుమార్‌ అందిస్తున్నాడు. అంతే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ తో పాటు అన్ని విషయాలను కూడా సుకుమార్‌ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారట.

సెల్ఫిష్‌ కు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే జరుగుతోంది. షూటింగ్ కు సంబంధించిన విషయాలను.. ఇప్పటి వరకు పూర్తి అయిన రషెష్‌ ను సుకుమార్‌ కు చూపించి వివరించారని తెలుస్తోంది. ఈ సందర్బంగా అశ్విన్‌ రెడ్డి సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలను షేర్‌ చేసి దర్శకుడు సుకుమార్‌ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సినిమా బాధ్యతలు ఆయన చూసుకుంటున్నట్లుగా చెప్పకనే చెప్పాడు.

సుకుమార్ గతంలో సూపర్‌వైజ్‌ చేసిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఉప్పెన సినిమా తో పాటు ఆయన శిష్యులు దర్శకత్వం చేసిన చాలా సినిమాలను ఆయన వెనుక ఉండి నడిపించాడు. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు సక్సెస్ అయ్యాయి. కనుక సెల్ఫిష్ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల వారిలో మరియు ప్రేక్షకుల్లో ఉంది.

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్స్ అంతా కూడా స్టార్స్ కిడ్స్ అనే విషయం తెల్సిందే. కనుక దిల్‌ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ అశ్విన్ రెడ్డి కూడా వరుస సినిమాలతో కాస్త జాగ్రత్తగా స్క్రిప్ట్‌ లను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తే తప్పకుండా మంచి స్టార్‌ గా నిలుస్తాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దిల్‌ రాజు బ్యానర్‌ లో ఎంతో మంది నటించి స్టార్స్ అయ్యారు. కనుక అశ్విన్‌ రెడ్డి ని స్టార్‌ గా చేయడం కోసం దిల్‌ రాజు మరియు ఆయన సోదరుడు తీవ్రంగా కృషి చేస్తారు అనడంలో సందేహం లేదు.
Tags:    
  • AshwinReddy 
  • Sukmar 
  • DilRaju 
  • Tollywood 
  • Selfish 
  • RowdyBoys 
  • Industry 
  • MovieNews 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS