• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ మేనల్లుడి...

మహేష్ మేనల్లుడి చిత్రానికి 'హీరో' టైటిల్ ఖరారు.. ఆకట్టుకుంటున్న టీజర్..!

By - Tupaki Desk
Update: 2021-06-23 06:59 GMT
సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు.. ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయ అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ''హీరో'' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించిన మహేష్ బాబు.. సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ''అశోక్ నీ ఫస్ట్ సినిమా టైటిల్‌ ను లాంచ్ చేయడం కంటే సంతోషమైనది లేదు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. #HERO ప్రయాణం ప్రారంభమవుతుంది'' అని ట్వీట్ చేసిన మహేష్ చిత్ర బృందానికి విషెస్ అందించారు.

అశోక్ కౌబాయ్ గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ తో ''హీరో'' సినిమా టైటిల్ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. 'టక్కరి దొంగ' తరహాలోనే ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ మేజర్ హైలైట్ గా నిలవనుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో యంగ్ హీరో జోక‌ర్ గెట‌ప్‌ లో క‌నిపించి అందర్నీ ఆశ్య‌ర్య‌పరిచాడు. టైటిల్ టీజ‌ర్‌ ని బ‌ట్టి చూస్తే 'హీరో' సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది. అలానే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో లవ్ స్టోరీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక టీజర్ చివర్లో జోక‌ర్‌ లుక్‌ లో అశోక్ గ‌ల్లా క‌న్నింగ్ స్మైల్ హైలెట్ అని చెప్పాలి.

'హీరో' ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అశోక్ గల్లా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపిస్తున్న స్టార్ సింబల్, గన్ను, బుల్లెట్ మ‌రియు ఫిలిం రోల్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఇక టైటిల్ టీజర్ తో హీరో అశోక్ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేసి.. ప్రేక్షకుల మెప్పుపొందారు. శ్రీరామ్ ఆదిత్య మేకింగ్ స్టైల్ కి.. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా పనితనం - జిబ్రాన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'హీరో' సినిమా టైటిల్ టీజర్ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు పెంచేసింది.

డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న ''హీరో'' చిత్రంలో జగపతిబాబు - నరేష్ - కౌశల్యా - వెన్నెల కిశోర్ - సత్య - అర్చన సౌందర్య - మైమ్‌ గోపి - అజయ్‌ ప్రభాకర్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ - గల్లా అరుణకుమారి సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ రావిపాటి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ''హీరో'' చిత్రం విడుద‌ల‌కు సిద్దమవుతోందని మేకర్స్ ప్రకటించారు.
Full View
Tags:    
  • Hero First Look 
  • Hero Teaser 
  • Ashok Galla Movies 
  • Ashok Galla 
  • Mahesh Babu 
  • Nidhi Aggarwal 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS