నటిని కొట్టి బెదిరించిన అపరిచితుడు అరెస్ట్
దిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ పరిశ్రమలో బిజీ నాయికగా కొనసాగుతున్న ఓ నటిని అపరిచితుడు వేధిస్తున్నాడట. అంతేకాదు అతడు ఓ విషయమై సదరు నటితో గొడవ పడి కొట్టాడట. అంతేనా.. సోషల్ మీడియాలో నకిలీ ఐడీని సృష్టించి తుపాకీ ఫోటో షేర్ చేసి చంపేస్తానని బెదిరించాడట. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేశారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 26ఏళ్ల ఆ యువకుడి పేరు నితిన్ గంగ్వార్. నటిని కొట్టడమే గాక బెదిరింపులకు పాల్పడ్డాడట. అయితే అతగాడిని రోహిణి అనే ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి లోతుగా వెళితే .. సదరు నటిని అతగాడు చాలా కాలంగా సోషల్ మీడియాల్లో ఫాలో చేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో తనకు ఎదురవుతున్న వేధింపులు భరించలేక సదరు నటి సోషల్ మీడియాలో అతడిని బ్లాక్ చేసింది.
అయినా అతడు వదిలి పెట్టలేదు. అతను ఒక నకిలీ ఐడిని సృష్టించి.. తనకు తుపాకీ ఉందని ఓ ఫోటోని షేర్ చేసి బెదిరించాడు. ఇంతకీ ఇతగాడు ఎక్కడ ఉంటాడు? అని వెతికిన పోలీసులకు ఎట్టకేలకు చిక్కాడు. ఇక సదరు నటీమణి వృత్తిలో భాగంగా స్వస్థలం దిల్లీ నుంచి హైదరాబాద్ కి.. అలానే ముంబై .. చెన్నై వంటి నగరాలకు చుట్టేస్తుంటుంది. మోడల్ గా సక్సెస్ సాధించి నటిగా కొనసాగుతోంది. తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షన్నర పైగా ఫాలోవర్స్ ఉన్నారు.