• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టెర్మినేటర్‌ దొబ్బినందుకు...

టెర్మినేటర్‌ దొబ్బినందుకు ఆర్నాల్డ్‌ ఆనందం

By - Tupaki Desk
Update: 2015-04-09 03:30 GMT
ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌ అనగానే అందరికీ టెర్మినేటర్‌ సినిమానే గుర్తుకొస్తుంది. 1984లో వచ్చిన తొలి పార్ట్‌ హాలీవుడ్‌లో పెద్ద సంచలనం. ఈ సినిమాతో రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. ఆ తర్వాత టెర్మినేటర్‌ సిరీస్‌లో ఆర్నాల్డ్‌ నటించిన ది జడ్జిమెంట్‌ డే, రైజ్‌ ఆఫ్‌ ద మెషీన్స్‌ కూడా సూపర్‌ హిట్టయి.. ఆర్నాల్డ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఐతే సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా 'సాల్వేషన్‌'లో ఆర్నాల్డ్‌ లేడు. ఆ సినిమా తీసే సమయానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాలిఫోర్నియా గవర్నర్‌ పదవిలో బిజీ అయిపోయాడు ఆర్నాల్డ్‌.

దీంతో ఆర్నాల్డ్‌ స్థానంలో క్రిస్టియన్‌ బాలె హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది. ఆర్నాల్డ్‌ లేకపోవడమే ఫ్లాప్‌ అయిందని కొందరు.. కంటెంట్‌ బాలేకపోవడమే కారణమని ఇంకొందరు వాదించారు. ఐతే ఇప్పుడు టెర్మినేటర్‌ సిరీస్‌లో వస్తున్న ఐదో సినిమాలో మాత్రం ఆర్నాల్డే హీరో. ఈ సినిమా పేరు.. జెనిసిస్‌. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మళ్లీ టెర్మినేటర్‌ సిరీస్‌లో నటిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆర్నాల్డ్‌.. సాల్వేషన్‌లో తాను లేకపోవడం పట్ల చాలా సంతోషించాడు. ఆ సినిమాలో నటించకపోవడం గురించి స్పందిస్తూ.. ''థ్యాంక్‌ గాడ్‌.. ఇట్‌ సక్డ్‌'' అంటూ షాకింక్‌ కామెంట్‌ చేశాడు ఆర్నాల్డ్‌. ఒకవేళ జెనిసిస్‌ ఫ్లాప్‌ అయితే క్రిస్టియన్‌ బాలె కూడా ఇలాగే రెస్పాండయితే ఆర్నాల్డ్‌ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో?
Tags:    
  • Arnold Schwarzenegger 
  • Terminator 5 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS