బిగ్​బాస్​: అరియానా.. అవినాష్​ ఇద్దరిలో ఒకరికి వేటు తప్పదా?

Update: 2020-10-19 12:10 GMT
అనేక విమర్శలు, ఆరోపణలతో కొనసాగతున్న తెలుగు ‘బిగ్​బాస్’​ బాగానే ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఇప్పటికే హౌస్​ నుంచి దేవీ నాగవళ్లి, సుజాత బయటకు వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓటింగ్​ పరంగా కాకుండా.. హౌస్​లో అఫైర్లు నడేపేవాళ్లకు, ఎక్స్​ఫొజింగ్​ చేసేవాళ్లకు మాత్రమే ఉంచుతున్నారని.. బిగ్​బాస్​ ఓటింగ్​ను అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి ఆరోపణల నడమ ఈ వారం కుమార్​సాయి బయటకొచ్చేశాడు. అయితే సాయి ఎలిమినేషన్​పై కూడా సోషల్​ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నిజాయితీగా ఆడుతున్న ఓ ఇంటిసభ్యుడిని బలిపశువును చేశారంటూ కామెంట్లు వినిపించాయి.

ఈ వారం ఎవరూ నామినేట్​ అయ్యారంటే..
నామినేషన్ల ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ ముగిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏడో వారం ఎలిమినేషన్‌ కోసం అభిజిత్, నోయల్ సీన్, దివి వాద్యా, అవినాష్, మోనాల్ గజ్జర్, అరియానా నామినేట్ అయినట్టు సమాచారం. అయితే వీరిలో హారిక, అఖిల్, సోహైల్, మెహబూబ్, లాస్య తదితరులు నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారట. దీంతో అరియానా, అవినాశ్​ నామినేషన్​లో ఉన్నట్టు సమాచారం.

ఈ వారం అసలు ఎలిమినేషనే ఉండదా?

అయితే ఏడోవారం అసలు ఎలిమినేషన్​ ప్రక్రియ ఉండదని వార్తలు వస్తున్నాయి. ఈ వారం ఇంటి సభ్యులకు ఎలిమినేషన్‌ నుంచి కొంత ఊరట ఇచ్చే ప్రక్రియను తెరపైకి నిర్వాహకులు తీసుకురానున్నట్టు సమాచారం. కానీ ఎనిమిదో వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందట. మరోవైపు ఈ వారం మోనాల్​ను ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌కు తరలించే అవకాశం ఉంది.
Tags:    

Similar News