AP Vs TS వకీల్ సాబ్ అదనపు షోల‌కు అనుమ‌తి ఉందా?

Update: 2021-04-05 15:30 GMT
సినిమా-రాజ‌కీయాలు పెన‌వేసుకుని ఉండే రాష్ట్రంగా త‌మిళ‌నాడుకు పేరుంది. అక్క‌డ సినీఇండ‌స్ట్రీతో రాజ‌కీయాలు ముడిప‌డి ఉన్నాయి. చాలా మంది హీరోలు రాజ‌కీయాల‌తో ప్ర‌త్య‌క్షంగా అంట‌కాగి ఉండ‌డంతో వారికి ప్ర‌భుత్వాల నుంచి ముప్పు ఎప్పుడూ ఉంటుంది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి ముప్పు ఉందా? అంటూ చ‌ర్చ సాగుతోంది. మెగా హీరోలు రాజ‌కీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌పైనా ప్ర‌భుత్వాల పైనా సూటిగా ప‌దునైన అస్త్రాల్ని సంధిస్తూ జ‌నంలోకి వెళుతున్నారు. ఇది అధికార ప‌క్షానికి క‌చ్ఛితంగా కంట‌గింపుగా ఉండేదేన‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఇక ప‌వ‌న్ నైజాంలో కేసీఆర్ కి కొన్ని విష‌యాల్లో మ‌ద్ధ‌తుగానే ఉన్నా ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న న‌టించిన వ‌కీల్ సాబ్ స‌న్నివేశ‌మేమిటి? క‌రోనా భ‌యాల న‌డుమ జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండా ప్ర‌భుత్వాలు క‌ట్ట‌డి చేస్తే స‌న్నివేశ‌మేమిటో? అన్న చ‌ర్చ సాగుతోంది. క‌రోనా సెకండ్ వేవ్ కొంత‌వ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల్లో అదుపులో ఉంది. థియేట‌ర్లు వంద శాతానికి ఇప్ప‌టివ‌ర‌కూ అడ్డంకి లేదు. వ‌కీల్ సాబ్ భారీ బిజినెస్ దృష్ట్యా రిక‌వ‌రీ కోసం రోజుకు నాలుగు నుంచి ఆరు షోల‌కు పెంచుకునేలా అర్థ‌రాత్రి వ‌ర‌కూ షోల‌కు అనుమ‌తులు కావాల్సిందిగా ప్ర‌భుత్వాల్ని అభ్య‌ర్థిస్తున్నారు. దీనికి నైజాంలో అనుమ‌తించినా కానీ ఏపీలో జ‌గ‌న్ అనుమ‌తిస్తారా? అంటూ చ‌ర్చ సాగుతోంది.

ఇక సినీప‌రిశ్ర‌మ వ‌ర‌కూ వైయ‌స్ జ‌గ‌న్ క‌లుపుకుని వెళ్లే ధోర‌ణి చూపించ‌డం కొంత‌వ‌ర‌కూ భ‌రోసానిచ్చేదే. ప‌వ‌న్ విష‌యంలో ఆయ‌న ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను ఏపీకి త‌ర‌లించాలన్న ఆలోచ‌న జ‌గ‌న్ కి ఉంది. అలా చేస్తే ప‌వ‌న్ నుంచి మెగా కుటుంబం నుంచి మ‌ద్ధ‌తు ఉంటుంది. ఆ మేర‌కు చిరంజీవి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌స్తుత క్రైసిస్ స‌న్నివేశంలో ఏపీ ప్ర‌భుత్వం వ‌కీల్ సాబ్ కి అనుకూలంగా ఉంటుందో లేదో చూడాలి.

సెకండ్ వేవ్ దృష్ట్యా.. మ‌హారాష్ట్ర‌- ముంబైలో వీకెండ్స్ థియేట‌ర్లు మూసివేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. క‌ర్నాట‌క‌లో 50శాతం ఆక్యుపెన్సీ నియ‌మంతో థియేట‌ర్లు న‌డుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే 100శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు ర‌న్ అవుతున్నాయి.
Tags:    

Similar News