అనుష్క వెయిట్ ఎంతో తెలుసా?

Update: 2016-08-16 09:39 GMT
హీరోయిన్ల వయసే కాదు.. బరువు కూడా సీక్రెట్టే ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం హీరోయిన్లు ఏదీ దాచుకోవట్లేదు. అన్ని వ్యక్తిగత విషయాలూ పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్ల వెయిట్ ఎంత అనేది కూడా చెప్పేస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తంలో టాలెస్ట్ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి ఆ మధ్య ‘సైజ్ జీరో’ కోసం బాగా బరువు పెరిగి.. దాదాపు 80 కిలోలకు చేరుకుంది. కానీ ఆమె ఏవరేజ్ వెయిట్ మాత్రం 62 కిలోలే.  ఇక మరో టాప్ హీరోయిన్.. కొంచెం పొడవు కూడా ఎక్కువుండే కాజల్ బరువు 55 కిలోలట. శ్రుతి హాసన్.. తమన్నా కూడా సేమ్ వెయిట్ కావడం విశేషం.

ఈ మధ్య వరుసగా పెద్ద అవకాశాలు కొట్టేస్తున్న మరో టాల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ 57 కిలోలుంది ప్రస్తుతం. స్టార్ హీరోయిన్లలో అత్యంత తక్కువ బరువంటే సమంతదే. ఆమె 51 కిలోలే ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిపోయిన తాప్సి సేమ్ వెయిట్ ఉండగా.. మాజీ హీరోయిన్ అసిన్ బరువు 53 కిలోలే. నడుం సుందరి ఇలియానా... రింగు జుత్తు సుందరి కంగనా రనౌత్ సరిగ్గా ఇంతే కావడం విశేషం. కొంచెం బొద్దుగా ఉండే హన్సిక 58 కిలోలు.. ప్రియమణి 56 కిలోలు ఉన్నారు. దశాబ్ద కాలం నుంచి హీరోయిన్లుగా తలపడుతున్న నయతనార-త్రిష 55 కిలోలలతో సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తుండటం విశేషం. నిత్యామీనన్ పొట్టిగా ఉన్నా బరువు ఎక్కువే. ఆమె 58 కిలోల బరువుంది. ప్రణీత 56 కిలోలు.. రెజీనా 54 కిలోలు.. అంజలి 57 కిలోలు ఉన్నారు. ఎప్పుడూ మంచి ఫిజిక్ మెయింటైన్ చేసే శ్రియ 52 కిలోలే ఉంది. అవికా గోర్ వెయిట్ 53 కిలోలు.
Tags:    

Similar News