'సెన్సార్ ఎందుకుంది? అసలేం చేస్తుంది?'.. సుమన్ ఫుల్ ఫైర్

ఒకప్పుడు సుమన్ సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల దగ్గర సందడి కనిపించేది. ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూసే రోజుల్లో ఆయన చిత్రాలకు మంచి క్రేజ్ ఉండేది.

Update: 2026-09-21 13:28 GMT

ఒకప్పుడు సుమన్ సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల దగ్గర సందడి కనిపించేది. ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూసే రోజుల్లో ఆయన చిత్రాలకు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు అదే ఫ్యామిలీ ఆడియన్స్ కొన్ని సినిమాల విషయంలో థియేటర్‌ కు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ నటుడు సుమన్ అంటున్నారు. సినిమాల్లో పెరుగుతున్న వల్గారిటీపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి.

రీసెంట్ గా సెన్సార్ విషయంపై మాట్లాడిన సుమన్.. ప్రస్తుత సినిమాల కంటెంట్‌ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల వచ్చిన ఓ వల్గారిటీ మూవీని ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడిన ఆయన.. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి అలాంటి సినిమాను థియేటర్‌ లో చూడగలరా? అని ప్రశ్నించారు. నార్మల్ ఆడియన్స్ కు కనిపించే వల్గారిటీ సెన్సార్ బోర్డుకు కనిపించదా? అంటూ గట్టిగా క్వశ్చన్ చేశారు.

సినిమాలో ఏం చూపించాలి.. ఏది చూపించకూడదనే విషయంలో సెన్సార్‌ కు క్లియర్ గైడ్ లైన్స్ ఉండాలని సుమన్ అభిప్రాయపడ్డారు. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సినిమా విషయంలో బాధ్యత పూర్తయిందన్నట్టుగా కాకుండా.. ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లలపై దాని ఎఫెక్ట్ కూడా లెక్కలోకి తీసుకోవాలని సజెస్ట్ చేశారు. సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్‌ లో ఎంజాయ్ చేయాలని ఆయన అన్నారు.

మంచి కథ, ఎమోషన్స్, యాక్టింగ్ ఉంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని చెప్పారు. దీనికి మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాను ఎగ్జాంపుల్ గా ప్రస్తావించారు. ఆ సినిమాలో ఎమోషన్స్ తో పాటు చైల్డ్ సెంటిమెంట్, మంచి పెర్ఫార్మెన్స్ ఉండటంతో ప్రేక్షకులు ఆదరించారని పేర్కొన్నారు. అదే సమయంలో కేవలం వల్గారిటీ నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు అంగీకరించరని సుమన్ వ్యాఖ్యానించారు.

ఇటీవల వచ్చిన ఓ వల్గారిటీ మూవీకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని, కోట్ల రూపాయల నష్టం జరిగిందని అన్నారు. సినిమా మొదలుపెట్టే ముందే ప్రేక్షకుల టేస్ట్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కంటెంట్ చూస్తున్నారని సుమన్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో థియేటర్లలో కూడా వల్గారిటీ కంటెంట్ కనిపిస్తే యూత్, చిన్నారులపై దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

రీసెంట్ గా సినిమా కేవలం డబ్బులు సంపాదించే బిజినెస్ మాత్రమే కాదని.. సొసైటీపై ఎఫెక్ట్ చూపించే పవర్ ఫుల్ మీడియా అని సుమన్ గుర్తుచేశారు. మంచి అలవాట్లు, ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషన్స్ ను చూపించే సినిమాలు రావాలని కోరారు. ఏదేమైనా ఇప్పుడు సెన్సార్ ఎందుకుంది? అసలేం చేస్తుంది? అంటూ సుమన్ వేసిన ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. వల్గారిటీ కంటే కథ, ఎమోషన్, ఫ్యామిలీ ఆడియన్స్‌ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఎప్పటికీ థియేటర్లకు వస్తారన్నది ఆయన ఒపీనియన్ గా తెలుస్తోంది.

Tags:    

Similar News