#RAKA ..ఇండియన్‌ స్టాండార్డ్ కాదు గ్లోబల్‌ స్టాండార్డ్.. గిన్నిస్ రికార్డే ప్రూఫ్‌

అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా `రాకా`పై అంచ‌నాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు.

Update: 2026-09-21 16:26 GMT

అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా `రాకా`పై అంచ‌నాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అరుదైన ప్ర‌య‌త్నంగా ఇది చ‌రిత్ర సృష్టించ‌నుంద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఇండియన్ సినిమా స్టాండార్డ్స్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తూ `రాకా` ఒక‌ అద్భుతమైన రికార్డును సృష్టించింది. మోషన్ క్యాప్చర్ (MOCAP) టెక్నాలజీ ద్వారా రియల్ టైమ్‌లో అత్యధిక మంది నటులను ఒకేసారి క్యాప్చర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించింది. ఈ ఘనత సాధించినందుకు గాను చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన బిహైండ్-ది-సీన్స్ (BTS) మేకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అట్లీ ఆలోచనలకు తగినట్లుగా ఈ అసాధ్యమైన రికార్డును సాధ్యం చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారతదేశంలోనే సరికొత్త అత్యాధునిక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్, అట్లీ భారతీయ సినిమా హద్దులను చెరిపేస్తూ గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అద్భుతమైన విజువల్స్, సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులలో హృదయాల‌ను గెలుచుకున్నాయి.

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామాపై అల్లు అర్జున్ ఎంతో గర్వంగా ఉన్నానని తెలపగా.. ఈ రికార్డ్ కేవలం ఒక‌ ముందడుగు మాత్రమేనని.. మునుముందు రోజుల్లో ప్రేక్షకులకు మరిన్ని అద్భుతాలు చూపిస్తామని దర్శకుడు అట్లీ ధీమా వ్యక్తం చేశారు.

`రాకా` సినిమా `అత్యధిక మంది వ్యక్తులను రియల్‌టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేసిన` విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సాధించింది. ఏకకాలంలో 37 మంది పెర్ఫార్మర్లను మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా ఈ రికార్డ్ నమోదైంది. ఈ చారిత్రాత్మక ఘనతకు గుర్తుగా అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. భారతీయ సినిమాకు ఇది మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోషన్ క్యాప్చర్ - విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ వినియోగం ఇటీవలి కాలంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. షారూఖ్ ఖాన్ `రా.వన్` సినిమాతో టెక్నాలజీ పరంగా భారీ ప్రయోగాలు ప్రారంభం కాగా.. రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి`, `ఈగ`, ప్రశాంత్ నీల్ `సలార్` వంటి చిత్రాలు ఈ సాంకేతికతను తమదైన శైలిలో ఉపయోగించుకున్నాయి. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో, ఐ, కమల్ హాసన్ `విక్రమ్`, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ `కల్కి 2898 AD`, మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్`, ప్రశాంత్ వర్మ `హనుమాన్`వంటి చిత్రాలు మోషన్ క్యాప్చర్, CGI - విజువల్ ఎఫెక్ట్స్ వాడకంలో ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్లాయి.

Tags:    

Similar News