సుస్మిత బాట పడతావా స్వీటీ?
అటు కమర్షియల్ సినిమాలను.. ఇటు లేడీ ఓరియంటెడ్ రోల్స్ ను.. చేసుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది అనుష్క. ఆమెలా సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్లుగా రాణించిన వారున్నా.. రెండు విధాలుగా రాణిస్తూ కెరీర్ ను కొనసాగించిన వాళ్లు మాత్రం లేరు. ఈమధ్య స్వీటీ ఎక్కడికెళ్లినా రిపీటెడ్ గా ఎదురవుతున్న ప్రశ్న పెళ్లెప్పుడనే.
ఈ బ్యూటీ పెళ్లి గురించి పెద్దగా ఇంట్రస్టింగ్ గా మాట్లాడటం లేదు కానీ.. పిల్లలంటే మాత్రం తనకు చాలా ఇష్టమంటోంది. అసలు తన పెళ్లి గురించి మరీ ఎక్కువగా థింక్ చేయొద్దంటూ ఫ్యాన్స్ కు ఉచిత సలహా కూడా ఇస్తోంది. తన పెళ్లి గురించి వచ్చే ఊహాగానాలను కూడా పెద్దగా పట్టించుకోవద్దని అంటోంది. ‘‘నాకు పిల్లలంటే భలే ఇష్టం. కానీ అదొక్కటే పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి రీజన్ కాదు కదా. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నా వెంటనే నేనే ఆ సంగతి పిలిచి మరీ చెబుతాను. ఈలోగా ఫలానా వాళ్లతో పెళ్లి అంటూ వచ్చే రూమర్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’’అంటోంది అనుష్క.
స్వీటీ ఓ పక్క పిల్లలంటే ఇష్టమంటోంది.. పెళ్లి మాటెత్తితే దాటేస్తోంది. పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలంటే బాలీవుడ్ హీరోయిన్... మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ లా దత్తత తీసుకోవడమే మార్గం. అనుష్క మాటలు చూస్తుంటే అలాంటి ఆలోచనలేవో చేస్తున్నట్టే ఉంది. ఆమె అభిమానులేమో చక్కగా పెళ్లి చేసుకోమని సలహాలిస్తున్నారు. మరి చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.