• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్‌, నిత్య.. నెక్స్ట్ ...

నయన్‌, నిత్య.. నెక్స్ట్ ఈ సుందరేనా?

By - Tupaki Desk
Update: 2015-09-11 17:30 GMT
ఇప్పుడు టాలీవుడ్ అంత‌టా కేర‌ళ కుట్టి అనుపమ్ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పేరు మారు మ్రోగిపోతుంది. కేవ‌లం ఫ‌లానా సినిమాలో ఎంపికైంద‌న్న ఒక్క వార్త అమ్మ‌డికి బోల్డెంత ప్ర‌చారాన్ని తెచ్చిపెట్టింది. ప్రేమ‌మ్ సినిమాతో మ‌ల‌యాళ ఇండ‌స్ర్టీకి అడుగు పెట్టిన ఈ భామ తొలి సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీ తో తెర‌కెక్కిన చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా అదే పేరుతో నాగ చైత‌న్య హీరోగా రీమేక్ అవుతుంది. ఇందులోనూ  ఈ భామ మెయిన్ లీడ్ కు ఎంపికైంది. హారిక‌-హాసిని బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతోంది.

తాజాగా నితిన్ - త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో కూడా సొగ‌స‌రి ఎంపికైంది. తెలుగులో ఆరంభ‌మే రెండు పెద్ద అవ‌కాశాల‌తో ఈ 19 ఏళ్ల సుంద‌రి  అంద‌రి దృష్టిలో ప‌డింది. ఈ రెండు సినిమాలు విజ‌యం అందుకోవ‌డంలో ఎలాంటి సందేహం లేదు. స‌మంత అరంగేట్రం కూడా  టాలీవుడ్ లో ఇలాగే జ‌రిగింది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కిన  ఏమాయ చేసావే సినిమా అప్ప‌ట్లో పెద్ద హిట్ట‌యింది. ఈ హిట్ తోనే మాతృభాష త‌మిళ్ లో కూడా అవ‌కాశాలు అందుకుంది. త‌ర్వాత పెద్ద హీరోయిన్ అయిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు భాష వేరైన ఆ సంద‌ర్భాన్ని అనుప‌మ్ గుర్తు చేసింది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ కు మ‌రో జెస్సీ వ‌చ్చింద‌నిపిస్తోంది.

మ‌ల‌యాళ బ్యూటీస్‌ లో న‌యన‌తార‌, నిత్యామీన‌న్ టాప్‌ స్టాట్ హీరోయిన్ లుగా వెలిగిపోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అంత రేంజులో పాపులారిటీ సంపాదించిన వేరొక భామ లేరు. న‌వ‌త‌రం నాయిక‌ల్లో మ‌ల్లూ బ్యూటీలు ఇలా వ‌చ్చి అలా వెళుతున్నారు. ఇప్పుడు ఈ భామ ఆ బ్లాంక్ స్పేస్‌ని ఫిల్ చేస్తుందేమో చూడాలి.
Tags:    
  • Anupama Parameswaran 
  • Tollywood Movies 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS