• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ డైరెక్టర్ పైనే ఆశలు...

ఆ డైరెక్టర్ పైనే ఆశలు పెట్టుకున్న అనుపమ

By - Tupaki Desk
Update: 2020-03-29 03:30 GMT
అనుపమ పరమేశ్వరన్...మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా బ్యూటీతో పాటు యాక్టింగ్ కూడా తన సొంతమని నిరూపించుకుంది. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' చిత్రంలో నటించిన అనుపమా పరమేశ్వరన్, నితిన్ సరసన 'అ ఆ' సినిమాలోనూ నటించింది. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాలలో నటించి తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత మన తెలుగు హీరోల సరసన 'హలో గురూ ప్రేమ కోసమే' లాంటి అడపా దడపా చిత్రాలు చేస్తూనే వుంది.

'రాక్షసుడు' సినిమాతో విజయం సాధించినప్పటికీ, తర్వాత అవకాశాలు రాకపోవడంతో కాస్త గ్యాప్ వచ్చి రేస్ లో వెనుకబడిపోయింది. అయితే రీసెంటుగా నిఖిల్ హీరోగా ప్రారంభించిన 'కార్తికేయ-2' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. అనుపమ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికవడానికి ముందు చాలా పెద్ద కథే నడిచిందంట. వివరాల్లోకి వెళ్తే కార్తికేయ -2 చిత్రానికి డైరెక్టర్ చందు మొండేటి. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన 'ప్రేమమ్' సినిమాలో అనుపమ హీరోయిన్. ఈ పరిచయంతో అను.. చందు మొండేటి పైనే మళ్లీ ఆశలు పెట్టుకుంది. అన్ని ప్రయత్నాలు చేసి చివరకు కార్తికేయ 2 మూవీలో ఛాన్స్ వచ్చేలా చేసుకుంది. అనుపమ కోసం చందు మొండేటి హీరో నిఖిల్ ని, నిర్మాతలను కూడా ఒప్పించాడంట. ఏదేమైనా ఈ సినిమాతో అనుపమ మళ్లీ ట్రాక్ లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.


Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS