• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'క్రేజీ అంకుల్స్‌' నుంచి...

'క్రేజీ అంకుల్స్‌' నుంచి 'అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ' సాంగ్..!

By - Tupaki Desk
Update: 2021-08-16 13:40 GMT
బుల్లితెర బ్యూటీ యాంకర్, 'బిగ్ బాస్' ఫేమ్ శ్రీముఖి ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ''క్రేజీ అంకుల్స్‌''. ఇందులో సింగర్ మనో (నాగూర్ బాబు) - రాజారవీంద్ర - భరణి - పోసాని కృష్ణ మురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిరణ్ తలసిల సమర్పణలో గుడ్‌ సినిమా గ్రూప్‌ మరియు బొడ్డు అశోక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు.

'అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ.. ఆడదాని కోసం ఆడపడితే తందానాకు అయ్యింది..' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. భోలే శవాలి దీనికి ట్యూన్ సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఈ సాంగ్ కు ఆనంద్ గుర్రం సాహిత్యం అందించారు. ఇరవైల్లో చెయ్యని అల్లర్లు యాభైల్లో చేయాలని క్రేజీ అంకుల్స్.. ఒక అమ్మాయి ప్రేమ కోసం పడే పాట్లని ఇందులో చూపించారు. ఈ చిత్రానికి పి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'క్రేజీ అంకుల్స్' మూవీకి డార్లింగ్ స్వామి స్టోరీ మరియు డైలాగ్స్ అందించారు. ఈ చిత్రంలో, గిరిధర్‌ - అదుర్స్‌ రఘు - హేమ తదితరులు ఇతర పాత్రలో నటించారు. ఈ నెల 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View
Tags:    
  • Anukunnadokkatee ayyindi Okkati 
  • Crazy Uncles 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS