• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప'లో భర్త...

'పుష్ప'లో భర్త తేలిపోయాడు.. ఇప్పుడు నాని సినిమాలో భార్య ఎలా మెప్పిస్తుందో..!

By - Tupaki Desk
Update: 2021-12-20 14:30 GMT
మలయాళ స్టార్ కపుల్ ఫ‌హాద్ ఫాజిల్ - నజ్రియా నజీమ్ లు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 'రాజా రాణి' అనే డబ్బింగ్ సినిమాతో నజ్రియా.. 'ట్రాన్స్' వంటి ఓటీటీ సినిమాతో ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ క్రమలో మొదటిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు.

ఇప్పటికే ''పుష్ప: ది రైజ్'' సినిమాతో ఫాహాద్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహాద్ లుక్ ఆకట్టుకున్నప్పటికీ.. సినిమాలో అతని పాత్ర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

'పుష్ప' పార్ట్-1 క్లైమాక్స్ కి 20 నిమిషాల ముందు వచ్చే ఫహద్ ఫాజిల్ పాత్ర తేలిపోయిందనే కామెంట్స్ వచ్చాయి. అతని ట్రాక్ చాలా సాగతీతగా ఉండటంతో పాటుగా కోరుకున్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కాకపోతే భన్వర్ సింగ్ పాత్ర రెండో భాగంలో మెయిన్ విలన్ గా మారుతారనే హింట్ ఇచ్చారు.

మరి 'పుష్ప: ది రూల్' లో పుష్పరాజ్ ను ఢీకొట్టే పాత్రలో అసలైన పెర్ఫార్మన్స్ ను మలయాళ నేచురల్ స్టార్ బయటపెడతారేమో చూడాలి. మరోవైపు నజ్రియా ఫహాద్ ''అంటే.. సుందరానికీ!'' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.

నేడు సోమవారం నజ్రియా పుట్టినరోజు సందర్భంగా 'అంటే.. సుందరానికీ' టీమ్ స్పెషల్ పోస్టర్ తో లవ్లీ హీరోయిన్ కు శుభాకాంక్షలు తెలియజేసింది. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో చిరునవ్వులు చిందిస్తున్న నజ్రియా లుక్ ఆకట్టుకుంటోంది. 'పుష్ప' పార్ట్-1 లో ఫహాద్ పెద్దగా అలరించలేకపోయారు.. మరి ఇప్పుడు నాని సినిమాతో నజ్రియా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, 'అంటే.. సుందరానికీ' చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై న‌వీన్ యెర్నేని - వై. ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ సంగీతం సమకూరుస్తుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మ్యూజిక‌ల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే 'పుష్ప' సినిమాని కూడా మైత్రీ సంస్థే నిర్మించిన సంగతి తెలిసిందే. ఇలా ఫ‌హాద్ ఫాజిల్ తో పాటుగా అతని భార్య నజ్రియా ను మైత్రీ బ్యానర్ లోనే టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేస్తుండటం గమనార్హం. మాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. తెలుగులో ఎలా రాణిస్తారో చూడాలి.


Tags:    
  • Ante sundaraniki Team 
  • Nazriya Nazim 
  • ActressTollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS