ప్రపంచానికి కొత్త హీరో దొరికాడు

Update: 2015-07-23 14:31 GMT
సాలీడు మనిషిని హీరోగా చేసి ‘స్పైడర్ మ్యాన్’ తీస్తే ఔరా అనుకున్నాం. గబ్బిలం మనిషిని హీరోగా మార్చి ‘బ్యాట్ మాన్’ తీస్తే ఇంకా ఆశ్చర్యపోయాం. ఇంతలోనే ‘ఐరన్ మ్యాన్’ కూడా వచ్చాడు. ఐతే వీళ్లందరరూ ఇప్పుడు పాతబడిపోయారు. మొహం మొత్తేశారు. ప్రేక్షకులకు ఇంకో కొత్త హీరో కావాలి. ఈ సంగతి గ్రహించే హాలీవుడ్ వాళ్లు రూటు మార్చేశారు. కొత్త హీరోను పట్టుకొచ్చేశారు. అతనే ‘యాంట్ మ్యాన్’. అంటే ప్రపంచానికి దొరికిన కొత్త హీరో చీమే. ఇప్పటిదాకా ప్రపంచంలో అత్యంత చిన్న హీరో మన ‘ఈగ’గాడే అనుకున్నాం. కానీ ఇప్పుడు చీమగాడు వచ్చేశాడు. సైజు చిన్నదే కావచ్చు కానీ.. హాలీవుడ్‌లో ఇప్పుడు ఆ చిన్న సైజు హీరోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ శుక్రవారం ఇండియాలో కూడా అడుగుపెట్టేస్తున్నాడు యాంట్ మ్యాన్.

హాలీవుడ్ జనాలకు యాంట్ మ్యాన్ విన్యాసాలు భలేగా నచ్చేస్తున్నాయి. ఇందులో ఓ సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. విలన్ గన్నుతో హీరో మీద గురిపెడతాడు. ఇక ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం. హీరోకు చావు గ్యారెంటీ అనుకుంటాం. కానీ హీరో తన సూటుకున్న బటన్ నొక్కడం ఆలస్యం.. చీమ సైజులోకి మారిపోతాడు. అప్పటికే విలన్ ట్రిగ్గర్ నొక్కేసి ఉంటాడు. బుల్లెట్ ఎక్కడికో వెళ్లిపోతుంది. విలన్ షాక్లో ఉండగానే ‘యాంట్ మ్యాన్’ విలన్ మీదికి దూకి అతడి పని పట్టేస్తాడు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలున్నాయి యాంట్ మ్యాన్. పీటన్ రీడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘యాంట్ మ్యాన్’గా పాల్ రడ్ నటించాడు.
Tags:    

Similar News