హాలీవుడ్‌ సినిమాలలో ఇదే బోరు

Update: 2015-08-10 05:38 GMT
హాలీవుడ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల కళ్లు అలవాటు పడిపోయాయి. బుల్లితెర పై అనువాద చిత్రాలు చూసి చూసి చివరికి హాలీవుడ్‌ కల్చర్‌ అలవాటైపోయింది. అందుకే ఏదైనా ఇంగ్లీష్‌ పిక్చర్‌ రిలీజవుతోందంటే ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారంతా. అయితే ఇటీవలి కాలంలో హాలీవుడ్‌ సినిమాల్లో రొటీన్‌ స్టఫ్‌ మన జనాలకు విసుగు తెప్పిస్తోంది. పదే పదే రొటీన్‌ కథలతో సినిమాలు చూడాల్సొస్తోంది.

మొగుడు - పెళ్లాం విడిపోవడం, విడాకులు తీసుకోవడం .. అటుపై వేరొకరితో అనుబంధం పెంచుకోవడం, క్లయిమాక్స్‌ లో వాస్తవం తెలుసుకుని తిరిగి మాజీలతో కలిసిపోవడం, పిల్లల విషయంలో బాధ్యత గల తల్లిదండ్రులు అనిపించుకోవడం.. ఇలాంటి కథలతో హాలీవుడ్‌ లో చాలా సినిమాలొచ్చాయి. టేకెన్‌, టేకెన్‌ 2 .. లేటెస్టు గా రిలీజైన 'యాంట్‌ మేన్‌' వంటి సినిమాలన్నీ ఇదే తరహాలోని సినిమాలు.

అయితే యాంట్‌ మేన్‌ లో మాత్రం హీరో డైవోర్సీ. చివరికి భార్యతో రీయూనియన్‌ అవ్వడు. అదే ఈ సినిమాలో కొత్త. పదే పదే అదే రిపీట్‌ చేస్తే కష్టం అని భావించారో ఏమో ఈ సినిమా లో కొంత డైవర్షన్‌ తీసుకున్నారన్నమాట! దూరపు కొండలు నునుపు. బాహుబలి ప్రభంజనంతో మన కథలు కూడా హాలీవుడ్‌ లో ఎక్కే రోజొచ్చింది.
Tags:    

Similar News