రానా 'విరాటపర్వం' లో మరో టాలెంటెడ్ హీరోయిన్..!

Update: 2020-12-11 05:20 GMT
దగ్గుబాటి రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. 'నీదీ నాదీ ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. లాక్‌ డౌన్ కారణంగా షూటింగ్‌ కి బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్ ఇటీవలే తిరిగి చిత్రీకరణ ప్రారంభించారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఈ చిత్రంతో ఓ కీలక పాత్ర కోసం హీరోయిన్ నివేత పేతురాజ్ ని తీసుకున్నారు.

తెలుగు తమిళ భాషల్లో బిజీగా హీరోయిన్ గా మారిన నివేథా పేతురాజ్ ప్రస్తుతం 'విరాటపర్వం' షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ చిత్రంలో లీడ్ యాక్టర్స్ అందరూ ఇంతకముందు నటించని పాత్రల్లో కనిపించనున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా - సాయి పల్లవి ఉద్యమకారుల పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో నందితా దాస్‌ - ఈశ్వ‌రీరావు - జ‌రీనా వ‌హాబ్ - నవీన్ చంద్ర - సాయి చంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. హాలీవుడ్‌ కు చెందిన డానీ సాంచెజ్‌ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రాఫ‌ర్స్ గా ప‌నిచేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News