• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమిళ రాజకీయాల్లో మరో...

తమిళ రాజకీయాల్లో మరో స్టార్ హీరో పక్కా ప్లానింగ్... పెర్ఫెక్ట్ టైమింగ్ అంటున్న అభిమానులు

By - Tupaki Desk
Update: 2022-02-08 13:30 GMT
రాజనీకాంత్ తర్వాత తమిళ సినిమా రంగాన్ని ఆస్థాయిలో ఏలిన నటుడు విజయ్. తమిళనాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగడానికి  విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు.  వియజ్ పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయం అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం తమిళ రాజకీయాలను పరిశీలిస్తే బలమైన విపక్షం ఏదీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అన్నాడీఎంకే పూర్తిగా బలహీనమైపోయింది.

ఆ పార్టీని సరైన దిశలో నడిపించే నాయకులు ఎవ్వరూ లేరు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు తమిళనాడులో ఎప్పుడూ తోక పార్టీలే ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అంటకాగడమే తప్ప... స్వతంత్రంగా బరిలోకి దిగే పరిస్థితి లేదు. అంతటి జనాదరణ లేదే. నిజం చెప్పాంలటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎంకే నేత స్టాలిన్ ను ఢీ కొట్టే మొనగాడు, అంతటి  జనాకర్షణ ఉన్న నేత తమిళ రాజకీయాల్లో కనిపిండం లేదు.

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రజలు ఎదురుచూశారు. కానీ ఆయన వెనకడుగు వేశారు. పార్టీ అంటూ  హడావుడి చేసినా.. రాజకీయ కదనరంలోకి దూకే సాహసం చేయలేకపోయారు. ఇక మీదట కూడా రాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టం  చేశారు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా ప్రజలు ఆయన్ని ఆదరించలేదు. తమిళనాట ఏ ఎన్నికల్లోనూ కమల్ హాసన్ ప్రభావం చూపలేకపోయారు.

ఈ రాజకీయ సూన్యమే విజయ్ కి  కలిసొస్తుందన్న విశ్లేషణలు వెలువుడుతున్నాయి. దీనికి తోడు కొన్ని నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు శాంపిల్ అన్నట్టుగా బరిలోదిగారు. 125 స్థానాల్లో పోటీ పడితే 115 చోట్ల విజయం సాధించారు. ఇది కూడా విజయ్ కు సానుకూల సంకేతమే.

డీఎంకే పరంగా చూస్తే స్టాలిల్ తర్వాత ఆ పార్టీలో జనాకర్షక నేత ఎవ్వరూ లేరు. ఆయనకు కూడా వయస్సు 65 దాటింది. ఆయన తన వారసుడిని తీర్చిదిద్దేపనిలో పడతారు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. దీనికితోడు తమిళ రాజకీయాల్లో ఒక పార్టీ వరుసగా రెండోసార్లు గెలవడం చాలా అరుదు. వచ్చే ఎన్నికల నాటికి విజయ్ బలమైన పునాది వేసుకోగలితే ఆయన తిరుగుడందని విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    
  • Vijay Thalapathy 
  • Tamil politics 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS