మరో సౌత్ బ్లాక్ బస్టర్ హిందీలో రీమేక్
దక్షిణాది సినిమాల్ని రీమేక్ లు చేసి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. మాతృకలో బ్లాక్ బస్టర్ అన్న టాక్ దక్కించుకుందంటే వెంటనే ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి స్టార్ హీరోలు.. నిర్మాతలు ఆలోచించడం లేదు. వెంటనే రీమేక్ రైట్స్ కోసం పెద్ద మొత్తాల్ని వెచ్చిస్తున్నారు. ఆలస్యం కాకుండా రైట్స్ కొనుక్కుని పట్టాలెక్కించేస్తున్నారు. ఇంకొంత మంది నిర్మాతలైతే తామే స్వయంగా ఇతర భాషల్లోనూ రీమేక్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. గతేడాది తమిళ్ లో `ఓమై కడవులే` అనే ఓ చిత్రం రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది.
ఇందులో అశోక్ సెల్వన్ .. రితికా సింగ్.. వాణీ భోజన్ నటించారు. విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ లో నటించారు. అశ్వంత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా నచ్చడంతో రీమేక్ హక్కుల్ని అభిషేక్ బచ్చన్ దక్కించుకున్నారు. విజయ్ సేతుపతి పోషించిన గెస్ట్ రోల్ లో అభిషేక్ బచ్చన్.. అశోక్ సెల్వన్ పాత్రలో మీజాన్ జాఫర్ నటించనున్నట్లు సమాచారం. మాతృకకు దర్శకత్వం వహించిన దర్శకుడే హిందీ వెర్షన్ కు దర్శకత్వం వహించేలా అభిషేక్ బచ్చన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
`ఓహ్ మై కడవులే` ఓ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం. తమిళ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న చిత్రంగా నిలవడంతో పాటు .. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. సినిమాలో చాలా మంది కొత్త ఆర్టిస్టులున్నప్పటీకీ అంతా చక్కగా నటించారు. పాత్రలన్ని వేటికవి ప్రత్యేకంగా డిజైన్ చేయడం ఆసక్తికరం. విజయ్ సేతుపతి కథని నేరెట్ చేస్తూనే...చిన్న పాత్రతో ఆకట్టుకుంటారు. ఓ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంగా ఉంటుంది. మరి బాలీవుడ్ స్క్రిప్ట్ లో ఎంత వరకూ మార్పులు తీసుకొస్తారో చూడాలి.