• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సముద్రఖని ఖాతాలో మరో మెగా...

సముద్రఖని ఖాతాలో మరో మెగా మూవీ

By - Tupaki Desk
Update: 2021-07-20 05:21 GMT
దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. అనుకోకుండా నటుడిగా మారి బిజీ ఆర్టిస్టు అయిపోయాడు సుమద్రఖని. ఈ తమిళ నటుడు రెండేళ్ల నుంచి తెలుగులోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో, క్రాక్ లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఈ దెబ్బతో టాలీవుడ్లోనూ అతను బిజీ అయిపోతున్నాడు. వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి సముద్రఖనికి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్న సముద్రఖని.. ఇటీవలే ‘సర్కారు వారి పాట’లో విలన్ పాత్రకు ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ వార్త నిజమే అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర చేయడమంటే కెరీర్ మరో స్థాయికి వెళ్లినట్లే. కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనూ సముద్రఖని నటించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉన్న చిరు.. దీని తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌ను మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే. ఇందులో సముద్రఖని నటించబోతున్నాడట. అతను ఈ సినిమాకు ఎంపికయ్యాడంటే కచ్చితంగా అది మెయిన్ విలన్ పాత్రకే అయ్యుంటుందని భావిస్తున్నారు. ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర చేశాడు. ఐతే అతను ఆ క్యారెక్టర్‌లో చాలా మోడర్న్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాడు. అలాంటి లుక్స్ సముద్రఖనికి సూట్ కావు. మరి రీమేక్ కోసం పాత్రను మార్చారా.. లేక సముద్రఖని వేరే పాత్ర ఏదైనా చేస్తున్నాడా అన్నది తెలియదు. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసిన మోహన్ రాజాకు.. సముద్రఖని ప్రతిభ ఏంటో బాగా తెలుసు. ఆయనకు మంచి పాత్రనే ఇస్తుండొచ్చు. ఈ సినిమా కోసం చిరు ఇటీవలే గడ్డం పెంచి కొత్త లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.
Tags:    
  • samuthirakani 
  • samuthirakani movies 
  • samuthirakani latest movies 
  • samuthirakani in lucifer 
  • Chiranjeevi 
  • mohan raja 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS