#RT69: మాస్ మహారాజా నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..!

Update: 2021-10-02 07:33 GMT
'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ.. వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ లను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే 'ఖిలాడి' షూటింగ్ పూర్తి చేసిన రవితేజ.. ప్రస్తుతం 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రవితేజ తన 69వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు.

'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' వంటి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో సక్సెస్ అందుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని #RT69 అనే వర్కింగ్ టైటిల్ తో అధికారికంగా ప్రకటించారు. ఈరోజు శనివారం గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు భాగం అవుతున్నారు.

#RT69 చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. త్రినాథరావు డైరెక్ట్ చేసిన గత రెండు చిత్రాలకు ప్రసన్న వర్క్ చేసిన సంగతి తెలిసిందే. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు మరియు సిబ్బంది వివరాలు త్వరలో వెల్లడించబడతాయి.

రవితేజ మరియు త్రినాధరావు నక్కిన ఆసక్తికరమైన కాంబోలో రాబోతున్న RT69 చిత్రం ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 4 నుండి ప్రారంభమవుతుంది.


Tags:    

Similar News