త్రివిక్రమ్ సినిమాలో మరో అక్కినేని హీరో..?

Update: 2021-05-15 02:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జున - నాగచైతన్య - అఖిల్ ఇలా వారసులుగా తరాలు మారుతూనే ఉన్నాయి. హీరోలు కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలలో ఒకరు సుమంత్. నాగార్జున తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20ఏళ్లు దాటినా ఇంతవరకు స్టార్ హీరో స్టేటస్ పొందలేకపోయాడు. అయినప్పటికీ తెలుగులో హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఆ మధ్యలో కెరీర్ పరంగా హిట్స్ లేకపోవడంతో భారీ గ్యాప్ తీసుకొని 'మళ్లీరావా' అనే సినిమాతో కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మళ్లీరావా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో జాగ్రత్తగా అడుగేసే ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే మెల్లగా అయినా సరే హిట్ కొట్టాలనే మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకొని కన్నడలో సూపర్ హిట్ ఫిల్మ్ రీమేక్ చేసాడు. కపటదారి అనే టైటిల్ తో ఇటీవలే విడుదలైన ఈ సినిమా పై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కపటదారి సుమంత్ కెరీర్ కు బూస్ట్ ఇవ్వలేకపోయింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మళ్లీ కపటదారి తర్వాత బ్రేక్ తీసుకుని తదుపరి సినిమాలకోసం కథలను వింటున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా సుమంత్ గురించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. టాలీవుడ్ స్టార్స్ త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఖరారు అయినటువంటి ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ హీరో సుమంత్ ను సంప్రదించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదివరకు అల వైకుంఠపురంలో సినిమా కోసం సుశాంత్ ను సంప్రదించాడు త్రివిక్రమ్. మరి ప్రస్తుతం సుమంత్ తో చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి అసలు విషయం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Tags:    

Similar News