హిట్టు కోసం సీక్వెళ్లను వదలరా?

Update: 2018-06-18 05:50 GMT
సినిమా ప్రపంచంలో కొన్ని కథలు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఒక సినిమా కథ మంచి ఆదరణ పొందితే దాన్ని ఇష్టం ఉన్నంత వరకు పొడిగించవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ చాలా వస్తున్నాయి. కానీ ఇతర భాషల్లో క్లిక్ అయినట్టుగా తెలుగులో పెద్దగా హిట్ అవ్వడం లేదు. స్టార్ హీరోలు అయితే సీక్వెల్స్ జోలికి పోరు గాని కొందరు దర్శకులు ముందుండి సీక్వెల్స్ కు ప్రాణం పోస్తారు.

ఇక మన దగ్గర హర్రర్ సినిమాలకు సక్సెస్ రేట్ చాలా తక్కువ. రాఘవ లారెన్స్ కాంచన 2 (గంగ) తప్పితే మిగతా సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. మొదట ట్రై చేసినప్పుడు ఇండస్ట్రీ హిట్టు అందుకున్న వారిలో ఎక్కువగా రెండో సారి మాత్రం డిజాస్టర్ చూశారు. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి అలాగే రాజు గారి గది 2 - మంత్ర 2 కథలను ఎవరు పట్టించుకోలేదు.  మొదట హైప్ బాగానే క్రియేట్ చేసి రిలీజ్ తరువాత నిరాశపరిచారు.

అన్ని సార్లు హర్రర్ కథలకు అందుకున్నంత రేంజ్ లో గుర్తింపు దక్కడం లేదు. ఇకపోతే నెక్స్ట్ మరో హారర్ సీక్వెల్ రానుంది. గీతాంజలి తో ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకున్న కోన వెంకట్ గ్యాంగ్ కొత్త దర్శకుడితో చేస్తున్న ప్రయోగమే గీతాంజలి 2. మరి ఈ సీక్వెల్ తో అయినా టాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలకు హిట్టు రేటు పెరుగుతుందో లేదో చూడాలి.     
Tags:    

Similar News