ఏపీలో భరత్ కు సపోర్ట్ లేదెందుకో?

Update: 2018-04-27 05:22 GMT
మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయ్యి వారం దాటుతున్నా.. ఇంకా ప్రమోషన్స్ చేస్తూ మూవీ కలెక్షన్స్ డ్రాప్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు యూనిట్.

పొలిటికల్ థీమ్ తో రూపొందిన ఈ చిత్రానికి తెలంగాణ పొలిటికల్ లీడర్ నుంచి సపోర్ట్ రావడం విశేషం. మూవీ ఇండస్ట్రీతో సన్నిహితంగా ఉండే కేటీఆర్.. భరత్ అనే నేను చిత్రాన్ని చూడడమే కాదు.. ఓ స్పెషల్ ప్రెస్ మీట్ కూడా పెట్టి మరీ.. సినిమాను ప్రశంసించారు. ఇది అటు సినిమాకు.. ఇటు కేటీఆర్ కు కూడా మైలేజ్ వచ్చేందుకు దోహదపడింది. సినిమాకు వసూళ్లొచ్చాయి. కేటీఆర్ కి సినిమాలు ఎంత దగ్గరో జనాలకు తెలియచెప్పిన సంఘటన అయింది. అయితే.. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కనిపించవన్నదే ప్రశ్న.

ఏపీలోనూ చాలామంది యువ నాయకులు ఉన్నారు. నిజానికి ఈ కంటెంట్ వారికి కూడా ఈజీగా కనెక్ట్ అయ్యేదే. కానీ ఎందుకో సినిమాలను పొగడడం.. ఫిలిం ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించడం.. సినిమా జనాలకు సన్నిహితంగా మెలగడం వంటివి.. అంతగా ఏపీలో కనిపించవు. ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగు సినిమా పరిశ్రమ విస్తరణ అనే మాట వినిపిస్తోంది కానీ.. నిజానికి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే.. ఏపీ కంటే తెలంగాణకే టాలీవుడ్ దగ్గరవుతోందని అనిపించక మానదు.


Tags:    

Similar News